స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరుగనున్నది. అబిడ్స్‌లోని జీపీవో సర్కిల్‌లో జరిగే కార్యక్రమానికి రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హాజరుకానున్నారు. జాతీయ గీతాలాపన కార్యక్రమం సందర్భంగా పోలీసులు అబిడ్స్ పరిధిలో ఉదయం 9.30 గంటల నుంచి మధాహ్నం 12.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
హైదరాబాద్ లోని మెట్రో రైళ్లతో సహా తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీలు, అంగన్ వాడీ కేంద్రాలు, విద్యా సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు, ఇతర ప్రదేశాల్లోనూ ఈ కార్యక్రమం జరగనుంది. ప్రయాణికులు, వాహనదారులు సహా ప్రజలంతా సరిగ్గా 11:30 కి జనగణమన జాతీయ గీతాన్ని ఆలాపించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చారు. మెట్రో స్టేషన్లలోనూ జాతీయ గీతాలాపన వుంటుంది కావున… ఆ ఒక్క నిమిషం మెట్రో రైళ్లు ఆగిపోనున్నాయి. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు మధ్యాహ్నం 12:30 గంటల వరకూ ట్రాఫిక్ నుమళ్లించారు.