Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరితో… మీట్ & గ్రీట్

తానా 23వ మహా సభలు ఘనంగా జరగనున్నాయి. వచ్చే ఏడాది జులై 7, 8, 9 తేదీలలో అమెరికాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న మహా సభల్ని  విజయవంతం చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ సభలకు అంజయ్య చౌదరి లావు అధ్యక్షులుగా, రవి పొట్లూరి కన్వీనర్‌ గా వ్యవహరించనున్నారు. ఇందులో భాగంగా కన్వెన్షన్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి ఆధ్వర్యంలో తానా మిడ్‌ అట్లాంటిక్‌ జట్టు ఫిలడెల్ఫియా స్థానిక నాయకులు, వలంటీర్లతో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావుతో మీట్‌ అండ్‌ గ్రీన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 300 మంది హాజరై తమ మద్దతు ప్రకటించారు. అందుకు ఫిలడెల్ఫియా తానా టీం రవి పొట్లూరి, సునీల్‌ కోగంటి, సతీష్‌ తమ్ముల ఫణి కంతేటి, రంజిత్‌ మామిడి, ప్రసాద్‌ క్రొత్తపల్లి, సురేష్‌ యలమంచి, కోటి యాగంటి, మోహన్‌ మల్లా, గోపి వాగ్వల, జాన్‌ మార్క్‌, రాజేశ్వరి కొడాలి, రామ ముద్దన, సాంబయ్య కోటపాటిని  ఈ సందర్భంగా వ్యక్తలు అభినందించారు.

Related Posts

Latest News Updates