Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పాత కేసుల్లో ఎమ్మెల్యే రాజా సింగ్ మళ్లీ అరెస్ట్

పాత కేసుల ఆధారంగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. రెండు రోజుల కిందటి అరెస్ట్ సందర్భంగా 41 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వలేదని, సుప్రీం మార్గదర్శకాలను పాటించలేదని రాజాసింగ్ తరపు న్యాయవాది వాదించడంతో ఎమ్మెల్యేకు బెయిల్ లభించింది. అయితే… పాత కేసుల ఆధారంగా పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. తన అరెస్ట్ సందర్భంగా రాజాసింగ్ ఇంటి ముందు పోలీసులు భారీగా చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

 

అయితే.. రహస్య ప్రదేశానికి రాజాసింగ్ ను తరలించినట్లు సమాచారం. తనను నగర బహిష్కరణ చేయాలని, పాత కేసుల్లో తనను అరెస్ట్ చేయాలని పోలీసులు చూస్తున్నారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ కు కొద్ది గంటల ముందు ఓ వీడియో విడుదల చేశారు.మరోవైపు ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజాసింగ్‌ ఇంటి చుట్టూ భారీగా పోలీసులను మోహరించారు. ఫిబ్రవరి, ఏప్రిల్‌లో నమోదైన కేసులకు సంబంధించి మంగళ్‌హాట్‌, షాహినాయత్‌గంజ్‌ పోలీసులు ఈ రోజు ఉదయమే రాజాసింగ్‌కు 41(A) సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని మంగళ్‌హాట్‌ పోలీసులు కోరారు.

Related Posts

Latest News Updates