ఢిల్లీ లిక్కర్ స్కాం అవకతవకల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులిచ్చింది. అయితే.. డిసెంబర్ 6 న తాను విచారణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం తనకు కొన్ని కార్యక్రమాలు వున్నాయని, అందుకే డిసెంబర్ 6 న విచారణకు రాలేనని సీబీఐ అధికారి రాఘవేంద్ర వత్సకు కవిత లేఖ రాశారు. అయితే… 11,12,14,15 తేదీల్లో విచారణకు అందుబాటులో వుంటానని లేఖలో కవిత తెలిపారు. అంతేకాకుండా… ఎఫ్ఐఆర్ లో తన పేరు కూడా లేదని, నిందితుల జాబితాలో తన పేరు లేదని అన్నారు.
అయితే.. తాను చట్టాన్ని పూర్తిగా గౌరవిస్తానని, దర్యాప్తుకు కూడా సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ ప్రతులు ఇవ్వాలని సీబీఐని కవిత కోరిన విషయం తెలిసిందే. దీంతో సీబీఐ అధికారులు ఈమెయిల్ ద్వారా కవితకు పంపారు. ఇందులో తన పేరు లేదని, అందుకే విచారణకు హాజరు కాలేనని కవిత అన్నారు.