Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సీబీఐ అధికారులకు ఎమ్మెల్సీ కవిత లేఖ

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవ్వాల రెస్పాండ్​ అయ్యారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు రావాలని అనుకుంటున్నామని కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ద్వారా సీబీఐ ఇచ్చింది. అయితే, దానికి కల్వకుంట్ల కవిత స్పందిస్తూ సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి లేఖ రాశారు ఈ ఏడాది జూలై 22న కేంద్ర హోంశాఖకు ప్రవీణ్‌రాయ్‌ చేసిన ఫిర్యాదు కాపీ, సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని తనకు అందించాలని లేఖలో ఆమె కోరారు. వీలైనంత త్వరగా ఆ పత్రాలను తనకు అందించాలని, డాక్యుమెంట్లు అందిన తర్వాతే క్లారిఫికేషన్‌ నోటీసులకు సంబంధించి కలిసే తేదీని నిర్ణయిద్దామని ఆ లేఖలో కవిత స్పష్టంచేశారు.

Related Posts

Latest News Updates