వైసీపీ ప్లీనరీపై జనసేన విమర్శలు చేసింది. వైఎస్ జగన్ భజన చేసుకోవడానికే ప్లీనరీ సరిపోయిందని ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విఫలమైందని, అందుకే సీఎం జగన్ ఒత్తిడిలో మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్లీనరీలో జగన్ మాట్లాడిన మాటలు అబద్ధమని నాదెండ్ల అన్నారు. నిజంగానే 95 శాతం మేనిఫెస్టోను పూర్తి చేశారా? అంటూ సూటిగా నిలదీశారు.
సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ సిద్ధాంతం, మేనిఫెస్టో అంతా వ్యక్తి చుట్టే తిరుగుతుందన్నారు. వైసీపీ పాలనలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వైసీపీ నేతలు రైతులను ఎందుకు ఆదుకోలేదని నాదెండ్ల ప్రశ్నించారు.