హైదరాబాద్‌లో ఆగస్టు 24, 25 తేదీల్లో భారీ స్థిరాస్తి ప్రదర్శన జరగనుంది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ (ఎన్‌ఏఆర్) ఇండియా.. హెచ్ఐసీసీలో ‘గేమ్ చేంజర్’ పేరిట 11వ ఎన్‌ఏఆర్ వార్షిక కన్వెన్షన్‌ను నిర్వహించనుంది. దీనికి హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్ఏ), కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ (సీఆర్ఈఏ–ఐ) హోస్టింగ్‌గా వ్యవహరిస్తున్నాయి.