విలువ 1.39 లక్షల కోట్లు!!
దేశంలోని పట్టణ ప్రాంతాల్లో అమ్ముడుపోకుండా (ఇన్వెంటరీ)గా ఉన్న గృహాల సంఖ్య అక్షరాల 1,83,582. వీటి విస్తీర్ణం 22.5 కోట్ల చ.అ.లు కాగా.. వీటి విలువ రూ.1,39,377 కోట్లు. ఇక, ద్వితీయ శ్రేణి నగరాల్లో 26,380 గృహాల ఇన్వెంటరీ ఉంది. విస్తీర్ణం 3.53 కోట్ల చ.అ.లు.. వీటి విలువ రూ.12,759 కోట్లని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి లోకసభలో వెల్లడించారు.
– దేశవ్యాప్తంగా ఉన్న ఇన్వెంటరీలో 55 శాతం ఎన్సీఆర్, ముంబైలో ఉన్నాయి. హైదరాబాద్లో 3,845 గృహాల ఇన్వెంటరీ ఉండగా.. విస్తీర్ణం 56 లక్షల చ.అ.లుగా ఉన్నాయి. వీటి విలువ రూ.1,878 కోట్లు. ఇతర నగరాల గణాంకాలు చూస్తే.. ఎన్సీఆర్లో 49,027 గృహాలు, విస్తీర్ణం 7 కోట్ల చ.అ., వీటి విలువ రూ.33,990 కోట్లు. ఎంఎంఆర్లో 51,721 గృహాలు, విస్తీర్ణం 5.09 కోట్ల చ.అ., వీటి విలువ రూ.61,451 కోట్లు. బెంగళూరులో 20,473 గృహాలు, విస్తీర్ణం 2.89 కోట్ల చ.అ., వీటి విలువ రూ.14,342 కోట్లు. చెన్నైలో 8,725 గృహాలు, విస్తీర్ణం 92 లక్షల చ.అ., వీటి విలువ రూ.3,601 కోట్లు. కోల్కత్తాలో 10,042 గృహాలు, విస్తీర్ణం 1.03 కోట్ల చ.అ., వీటి విలువ రూ.3,556 కోట్లు. పుణేలో 11,813 గృహాలు, విస్తీర్ణం 1.21 కోట్ల చ.అ., వీటి విలువ రూ.6,902 కోట్లు. అహ్మదాబాద్లో 1,556 గృహాలు, విస్తీర్ణం 23 లక్షల చ.అ., వీటి విలువ రూ.896 కోట్లు.