రోడ్ల పక్కన భారీ వృక్షాలు.. పచ్చదనం పరుచుకున్న పార్కులు దర్శనమిస్తాయి. మొక్కలతో ఆ ప్రాంతం నందవనాన్ని తలపిస్తుంది. కాలనీలోకి ప్రశేవించగానే పచ్చదనం ఆహ్వానం పలుకుతుంది. ఆ కాలనే నేరేడ్మెట్లోని వాయుసేన అధికారుల గహ సహకార సంఘం (వాయుపురి కాలనీ). పచ్చదనం.. ఆహ్లాదకరమైన వాతావరణం కాలనీ సొంతం. కాలనీలో ఆహ్లాదాన్ని పంచే అందమైన పార్కులు, పరిశుభ్రమైన పరిసరాలు, రోడ్ల పక్కన చెట్లు..ప్రతి ఇళ్లు రకరకాల మొక్కలతో ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుందీ కాలనీ. వేసవి కాలంలోనూ చల్లదనం పంచడం ఈ కాలనీ ప్రత్యేకత. జిల్లా కలెక్టర్లు, ఐపీఎస్ అధికారులు, ఆర్మీ ఉన్నతాధికారులు ఎంతోమంది కాలనీ సందర్శించి ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ప్రశంసించారు.
కాలనీకి పలు అవార్డులు..
పచ్చదనం,మొక్కల పెంపకం, ఇంకుడు గుంతుల ఏర్పాటు,ప్లాస్టిక్ నిషేధం తదితర కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకుగాను 2017లో జీహెచ్ఎంసీ నుంచి స్వచ్ఛ కాలనీ అవార్డు , 2018లో జలమండలి నుంచి బెస్ట్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అవార్డు, ఈ ఏడాదిలో స్వచ్ఛభారత్ కార్య క్రమాలకుగాను నేషనల్ రెసిడెన్సి వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి కాలనీకి జాతీయ అవార్డు, ఢిల్లీకి చెందిన క్వాలిటీ అష్యూరెన్స్ సర్వీసెస్ ప్రై .లి. సంస్థ నుంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) సర్టిఫికెట్ కాలనీకి లభించింది.
కాలనీలో రాత్రి కూడా పగలే..
వాయుపురి కాలనీ రాత్రి వేళలో కూడా పగలును తలపిస్తుంది. పచ్చదనం పరిశుభ్రత, హరితహారం, ఆహార వ్యర్థాలతో సేంద్రీయ ఎరువు తయారీ తదితర కార్యక్రమాలను వంద శాతం విజయవంతంగా అమలు చేసినందుకుగాను వాయుపురి కాలనీకి ‘జీహెచ్ఎంసీ స్వచ్ఛకాలనీ’ అవార్డు దక్కింది. ఈమేరకు జీహెచ్ఎంసీ అధికారులు కాలనీలో వందకుపైగా ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేశారు. దాంతో కాలనీ ఎల్ఈడీ దీపాల వెలుగులతో రాత్రి కూడా పగలుగా మారింది.
అందరి సహకారంతో ఆదర్శ కాలనీగా…
సభ్యులందరి సహకారం, సమన్వయంతో పని చేస్తూ కాలనీని ఆదర్శంగా తీర్చిదిద్దాం. ముఖ్యంగా చెత్త రహిత కాలనీగా తీర్చిదిద్దడానికి చెత్తను రోడ్ల మీద వేయకుండా విద్యుత్ స్తంభాలకు డబ్బాలను ఏర్పాటు చేశాం. వర్షపునీటి సంరక్షణకు ఇంకుడు గుంతల ఏర్పాటు. జీహెచ్ఎంసీ అధికారుల ప్రోత్సాహం చాలా ఉంది. జాతీయ పర్వదినాల్లో సాంస్కృతి కార్యక్రమాలు, నెలకు రెండుసార్లు సభ్యులం కలుసూ కాలనీ అభివద్ధిపై చర్చిస్తాం. వైద్య శిబిరాలు, పిల్లలకు క్రీడా పోటీలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వాయుసేన హౌసింగ్ కో–ఆపరేటివ్ సోసైటీ అధ్యక్షులు, మాజీ వింగ్ కమాండర్ టీజే. రెడ్డి తెలిపారు.