Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కువైట్ లో కొత్త రూల్… కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ప్రొఫెషనల్ టెస్టులు

ప్రవాసులపై కువైట్ ప్రభుత్వం కొత్త రూల్ పెట్టింది. అక్కడ కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ఇకపై కచ్చితంగా ప్రొఫెషనల్ టెస్ట్ నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఓ ప్యానెల్ ను కూడా ప్రకటించింది. ఆ ప్యానెల్ పేరు డెమోగ్రఫిక్ కమిటీ అండ్ ఎక్స్ పర్ట్స్ ప్యానెల్. దీని ప్రకారం సివిల్ సర్వీస్ కమిషన్, సొసైటీ ఇఫ్ ఇంజినీర్స్ విషయంలో అన్ని స్పెషలైజేషన్లలోని కార్మికుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఓ ఒప్పందం కుదిరిందని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే… కొత్తగా వచ్చే కార్మికులకు మాత్రమే పరీక్ష వుంటుందని, రాబోయే రోజుల్లో అందరికీ పరీక్షలుంటాయని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

 

మరోవైపు కువైట్ లో తమ ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయోనని అక్కడి ప్రవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఓ పక్క ప్రవాసులను ఆహ్వానిస్తూనే… మరోవైపు చాలా సంవత్సరాలుగా స్థిరపడ్డ ప్రవాస ప్రైవేట్ ఉద్యోగులను తొలగించేస్తున్నారు. తాజాగా మున్సిపల్ శాఖలో ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో స్థానికులకు ఉద్యోగాలిస్తున్నారు. ప్రస్తుతం కువైత్‌లోని ప్రభుత్వ సంస్థల్లో కేవలం 19.8శాతం మంది మాత్రమే ప్రవాస ఉద్యోగులు ఉన్నారు. ఈ గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి 31 వరకు ఆ దేశంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 4,51,960గా ఉంది. ఇందులో విదేశీ ఉద్యోగులు 89,827 మంది మాత్రమే. అంటే 19.8శాతం మంది ప్రవాస ఉద్యోగులు ఉంటే.. 80.2 మంది స్థానికులు ఉన్నారన్నమాట.

Related Posts

Latest News Updates