Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలంగాణలోనే మోడల్ లేదు.. దేశమంతా అమలు చేస్తారా? రేవంత్ రెడ్డి ఎద్దేవా

రాష్ట్రంలో అనేకమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రైతుల సమస్యలను పట్టించుకోని సీఎం..ఇతర రాష్ట్రాల రైతులకు పరిహారం ఇస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇక్కడి సమస్యలనే పట్టించుకోని సీఎం… బిహార్ లో కార్మికులకు సాయం చేస్తారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలోనే ఏ మోడల్ లేదని, దేశమంతా తెలంగాణ మోడల్ ను తెస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. సొంత రాష్ట్రంలో చనిపోయిన రైతు కుటుంబాలను, చనిపోయిన జవాన్ ల కుటుంబాలను కేసీఆర్ ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు.

 

ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కోసం తెలంగాణ ప్రజల సొమ్మును ఢిల్లీ, పంజాబ్, బిహార్ రాష్ట్రాలకు పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ మోడల్ అంటే.. కమీషన్లు, కాంట్రాక్టులే అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్,బీజేపీ రెండూ ఒకటే అని ఆరోపించారు. పార్టీ నాయకులను ఇష్టం వచ్చినట్లు కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. నల్గొండకు బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందన్నారు. సాగునీటి విషయంలో పాలమూరును కేంద్ర రాష్ట్రాలు మోసం చేశాయని విమర్శించారు. మునుగోడులో సమస్యలపై చర్చకు రాకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.

Related Posts

Latest News Updates