Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీయాక్టు నమోదు చేసిన సిటీ పోలీసులు

ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీయాక్ట్ నమోదైందని హైదరాబాద్ సీపీ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. చాలా సార్లు ఆయన ఓ మతాన్ని, వర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. మంగళహాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్‌ ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఈ కేసులు ఆధారంగా చేసుకొని బీజేపీ ఎమ్మెల్యేపై పీడి యాక్ట్ నమోదు చేసినట్టు చెప్పారు. అరెస్టుకు ముందు ఆయనకు 32 పేజీల పీడీ యాక్ట్‌ డాక్యుమెంట్‌ను అందించినట్టు కమిషనర్‌ వెల్లడించారు. ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక ఎమ్మెల్యేపై పీడీ యాక్ట్‌ నమోదవ్వడం ఇదే తొలిసారి. ఇక 2004 నుంచి రాజాసింగ్‌పై 101 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 18 మతపరమైన కేసులు ఉన్నాయి. వీటిలో కొన్ని సరైన సాక్ష్యాధారాలు లేక వీగిపోయాయి. మరికొన్నికోర్టు విచారణలో ఉన్నాయి.

Related Posts

Latest News Updates