ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసంలో రక్షా బంధన్ ను జరుపుకున్నారు. అయితే.. దీనికో స్పెషల్ వుంది. పీఎంవోలో పనిచేసే కార్మికుల పిల్లలతో ప్రధాని మోదీ రాఖీ పౌర్ణమి జరుపుకున్నారు. తోటమాలి, డ్రైవర్లు, ఇతర ఫోర్త్ క్లాస్ సిబ్బంది పిల్లలతో రాఖీలు కట్టించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారందరితో సరదాగా సంభాషించారు. వారందరికీ స్వీట్లు తినిపించి, రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మోదీ నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు ప్రకటించారు. రక్షా బంధన్ సందర్భంగా అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. మరో వైపు రక్షా బంధన్ సందర్భంగా ప్రధానికి పాకిస్తాన్ నుంచి ఖమర్ మొహ్సిన్ షేక్ అనే మహిళ రాఖీ పంపారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దేశ ప్రజలకు రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
#WATCH | Prime Minister Narendra Modi celebrated #RakshaBandhan with young girls today at his residence in Delhi.
This was a special Rakshabandhan as these girls were the daughters of sweepers, peons, gardeners, drivers, etc working at PMO.
(Video Source: PMO) pic.twitter.com/eSvd6gsgHb
— ANI (@ANI) August 11, 2022