Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఉద్యోగంలో ఉంటే నగరంలో.. రిటైర్డ్‌ అయితే శివారులో!

నగరవాసుల ఆలోచన ధోరణి మారింది. తినే తిండి.. వేసుకునే దుస్తులే కాదండోయ్‌ ఉండే ఇల్లు కూడా అందుబాటుకు, అభిరుచులకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఉద్యోగం చేస్తున్న రోజుల్లో అయితే ఇల్లు ప్రధాన నగరంలో లేదా కార్యాలయానికి దగ్గర్లో ఉండాలని, పదవీ విరమణ తర్వాత అయితే నగరానికి దూరంగా శివారు ప్రాంతాల్లో ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో రిటైర్డ్‌ ఉద్యోగుల చూపంతా శివారు ప్రాంతాల మీద పడటంతో ఇక్కడ వ్యక్తిగత గృహాలు, విల్లాలకు డిమాండ్‌ పెరిగింది.
శివార్లే నగరాలు..
హైదరాబాద్‌లో ఎక్కడుప్పు జనం నివాసం కోసం ఏర్పాటు చేసిన బస్తీలు, కాలనీలు ఇతర ప్రాంతాలన్నీ ఇప్పుడు వ్యాపార, వాణిజ్య కేంద్రాలుగా మారాయి. ఒకటి, రెండు అంతస్థులకే పరిమితమయ్యే ఈ ప్రాంతాల్లో ఇప్పుడు హైరైజ్‌ అపార్టుమెంట్లు వచ్చేశాయి. దీంతో రద్దీ పెరిగింది. ఇక్కడి భూముల ధరలు అమాంతం పెరిగాయి. గజం ధర లక్ష పైనే పలుకుతోంది. అద్దెకిస్తే భారీ మొత్తంలో నెల నెలా ఆదాయం వస్తోంది. అదే సమయంలో వాహనాల ధ్వనులు, ప్రశాంతమైన జీవనం ఉండడం లేదు. ఫలితంగా ఎక్కువ స్థలాన్ని, తక్కువ ధరకే కొనుగోలు చేసి ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు ఏకైక మార్గం శివారు ప్రాంతమనే భావన చాలా మందిలో పెరుగుతోంది. దూరదృష్టి ఉన్న వారు నగర శివారు వెళ్లి ప్రాంతాల్లో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు.
ఎగువ మధ్య తరగతి చూపు..
నగర శివార్లకు వెళ్లిపోతున్నవారిలో సంపన్నులే కాదు.. అమీర్‌పేట, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, అంబర్‌పేట్, సంతోష్‌నగర్‌ తదితర ప్రాంతాలకు చెందిన ఎగువ మధ్యతరగతి జీవులూ ఉంటున్నారు. చదువు, ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు వచ్చేవారిలో చాలా మంది ఈ ప్రాంతాల్లోనే ఉండడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా అమీర్‌పేట కేంద్రంగా ఉన్న ఐటీ శిక్షణ సంస్థలకు వేలాది మంది విద్యార్థులు వస్తుంటారు. వారికి ఆ చుట్టుపక్కలే వసతి దొరికితే ఉపయోగం. దీంతో.. చుట్టు పక్కల ఉన్న కాలనీలు, బస్తీల్లో ఒకప్పుడు వ్యక్తిగత ఇళ్లుగా ఉన్న భవనాలన్నీ ఇప్పుడు హస్టళ్లుగా మారిపోయాయి. అలాగే.. ఎస్సార్‌నగర్, ఎల్లారెడ్డి గూడ, మధురానగర్, వెంగళ్‌రావునగర్, మోతీనగర్, శ్రీనగర్‌ కాలనీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట,సనత్‌నగర్, కూకట్‌పల్లి, మియాపూర్, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో నివాస ప్రాంతాలన్నీ వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి. అద్దెలు అమాంతం పెరగడంతో యజమానులు తమ ఇళ్లను మొత్తంగా అద్దెకు ఇచ్చేసి శివార్ల వైపు వెళ్తున్నారు.
నగరంలో కొనలేక..
హైదరాబాద్‌లో పెరిగిపోతున్న ఇళ్ల ధరలను తట్టుకోలేని సామాన్యులు సైతం శివారు ప్రాంతాలవైపే చూస్తున్నారు. నగరంతో పోల్చితే శివారు ప్రాంతాల్లో భూముల ధరలు తక్కువగా ఉండడం, మౌలిక వసతులు మెరుగ్గానే ఉండడంతో దూరం గురించి ఆలోచించట్లేదు. శివార్లలోని ఇళ్లు, ఫ్లాట్ల అద్దెలు సైతం తక్కువగానే ఉంటున్నాయి. ఇది అద్దెలకు ఉండేవారిని ఆకర్షిస్తోంది. దీంతో గ్రేటర్‌ కలిపే అన్ని రోడ్డుల వైపు నగరం ఇళ్లను ప్లాట్‌ను కొంటున్నారు. ప్రస్తుతం నగరంలో వ్యక్తిగత ఇళ్లు, అపార్టుమెంట్లను సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో తమ బడ్జెట్‌లో సొంతిల్లు కావాలనుకునేవారు శివార్లవైపు మళ్లుతున్నారు. నగరంలో రెండు పడకల ఫ్లాటు కొనుగోలు చేయాలంటే రూ.45 లక్షల పైనే అవుతుంది. దానికి బదులు అదే బడ్జెట్‌లో నగర శివారులో 100 గజాల్లో వ్యక్తిగత ఇంటినే కొనుగోలు చేయవచ్చు. చాలామంది నగరంలో తమ ఇళ్లను వ్యాపారకేంద్రాలకు అద్దెకిచ్చి ఆ కిరాయిలనే ఈఎంఐగా కడుతూ శివార్లలో మళ్లీ ఇళ్లను కొంటున్నారు. కొంతమంది లగ్జరీ విల్లాల్లో అద్దెకుంటున్నారు. ఇక నగరంలో ఉన్న సంపన్నులు ప్రశాంతమైన వాతావరణం, తమ హోదాకు తగ్గట్టుగా గేటెడ్‌ కమ్యూనిటీలను ఎంచుకుంటున్నారు.

Related Posts

Latest News Updates