హైదరాబాద్కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ సుచిరిండియా గ్రూప్ సీఈఓ డాక్టర్ లయన్ కిరణ్కు ‘ప్రైడ్ ఆఫ్ ది నేషన్’ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొని, సేవతో పాటూ ఉద్యోగ అవకాశాలకు వెన్నుముకగా నిలిచి ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు ఈ అవార్డు వరించిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా లయన్ కిరణ్ ఈ అవార్డును అందుకున్నారు. సుచిరిండియా గ్రూప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ విభాగాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగిస్తుంది.