Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

శివకార్తికేయన్ ‘ప్రిన్స్’ నుండి ‘హూ యామ్ ఐ’ లిరికల్ వీడియో

వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతున్న కంప్లీట్ ఎంటర్‌ టైనర్‌ ‘ప్రిన్స్’. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో   ”బింబిలిక్కి పిలాపి” , జెస్సికా పాటలు చార్ట్ బస్టర్ గా  నిలిచాయి. తాజాగా ఈ చిత్రం నుండి ‘హూ యామ్ ఐ’ పాటని విడుదల చేశారు. సంగీత సంచలనం ఎస్ తమన్ ఈ పాటని తనదైన స్టయిల్ డ్యాన్స్ నెంబర్ గా ఈ పాటని కంపోజ్  చేశారు. శివకార్తికేయన్ ఈ పాటకు చేసిన డ్యాన్స్ మూమెంట్స్ మెస్మరైజ్ చేశాయి. డింకర్ కల్వల ఎనర్జిటిక్ గా పాడగా, ‘సరస్వతీ పుత్ర’ రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఇన్స్టంట్ హిట్ గా అలరించిన ఈ  పాట ప్రిన్స్ ఆల్బమ్ లో మరో చార్ట్ బస్టర్ గా నిలిచింది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్ గా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. అరుణ్ విశ్వ సహ నిర్మాత. తారాగణం: శివకార్తికేయన్, మరియా ర్యాబోషప్క, సత్యరాజ్ తదితరులు. సాంకేతిక విభాగం రచన, దర్శకత్వం: అనుదీప్ కె.వి సంగీతం: ఎస్ థమన్ నిర్మాతలు: సునీల్ నారంగ్(నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో)డి. సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ సమర్పణ: సోనాలి నారంగ్ సంగీతం: ఎస్ థమన్ డీవోపీ: మనోజ్ పరమహంస సహ నిర్మాత:  అరుణ్ విశ్వ ఎడిటర్: ప్రవీణ్ కెఎల్ ఆర్ట్ : నారాయణ రెడ్డి పీఆర్వో : వంశీ-శేఖర్.

Related Posts

Latest News Updates