Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

జకీర్ నాయక్ కూడా మాట్లాడాడు… ఆయనది తప్పు కానప్పుడు నుపుర్ ది తప్పెలా అవుతుంది? రాజ్ థాకరే

మహ్మద్ ప్రవక్తపై సంచలన వ్యాఖ్యలు చేసి, బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నుపూర్ శర్మకు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే మద్దతు లభించింది. నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలే గతంలో జకీర్ నాయక్ కూడా చేశాడని గుర్తు చేశారు. జకీర్ నాయక్ మాట్లాడింది తప్పు కానప్పుడు నుపుర్ శర్మది తప్పెలా అవుతుంది? అంటూ రాజ్ థాకరే సూటిగా ప్రశ్నించారు. జకీర్ నాయక్ మాట్లాడితే… ఎవ్వరూ క్షమాపణలు అడగలేదని, నుపుర్ ని మాత్రం అడుగుతున్నారని రాజ్ థాకరే ఫైర్ అయ్యారు.

Related Posts

Latest News Updates