Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కుమార్తె శివాని (వివాహం)‘విద్య వాసుల అహం’ సెట్స్‌లో జీవిత, రాజశేఖర్ ల సందడి

రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా ఎటర్నిటి ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కబోతోన్న సినిమా ‘విద్య వాసుల అహం’(వివాహం). ‘తెల్లవారితే గురువారం’ సినిమా తర్వాత మణికాంత్ గెల్లి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్ మరియు టైటిల్, యానిమేషన్ కాన్సెప్ట్ వీడియోను వినాయక చవితి స్పెషల్‌గా విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటన్నింటికి అద్భుతమైన స్పందన వచ్చింది.  తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్‌‌ను శివాని రాజశేఖర్ తల్లిదండ్రులైన జీవిత, రాజశేఖర్ సందర్శించారు. షూటింగ్ జరుగుతున్న తీరుకి ఈ సినిమా కాన్సెప్ట్ కి వాళ్ళు ఎంతో సంతోషించారు. ఈ సినిమా తన కుమార్తెకే కాకుండా టీమ్ మొత్తానికి విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందని, మంచి కంటెంట్‌తో వస్తున్న ఇటువంటి చిత్రాలకు ప్రేక్షకులు ఈ మధ్యకాలంలో బ్రహ్మరధం పడుతున్నారని పేర్కొన్నారు.   పెళ్ళైన ఒక జంట మధ్య ఉన్న ఇగో లతో ఈ సినిమా కథాంశం ఉండబోతోంది. కల్యాణి మాలిక్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విద్య వాసుల అహం త్వరలో థియేటర్స్ లో విడుదల కానుంది.  నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ సాంకేతిక నిపుణులు: చిత్రం: విద్య వాసుల అహం బ్యానర్: ఎటర్నిటి ఎంటర్టైన్మెంట్ సంగీతం: కల్యాణి మాలిక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మహేష్ దత్త మోటూరు సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి రచన: వెంకటేష్ రౌతు ఎడిటర్: సత్య గిడుటూరి నిర్మాత: లక్ష్మీ నవ్య మోటూరు  & రంజిత్ కుమార్ కొడాలి దర్శకత్వం: మణికాంత్ గెల్లి

Related Posts

Latest News Updates