Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

స్కాట్లాండ్ లో రోడ్డు ప్రమాదం… ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం

బ్రిటన్ లోని స్కాట్లాండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ కు చెందిన పవన్ బాశెట్టి (23), బెంగళూరుకు చెందిన గిరీశ్ సుబ్రహ్మణ్యం (23), నెల్లూరుకు చెందిన మోదేపల్లి సుధాకర్ (30) మరణించారు. అయితే… హైదరాబాద్ కు చెందిన మరో విద్యార్థి సాయి వర్మ (24) ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలోనే వున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నలుగురు కలిసి స్కాట్లాండ్ లో కారులో వెళ్తుండగా… వెనక నుంచి వచ్చి ఓ భారీ లారీ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు.

Related Posts

Latest News Updates