Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

దీపావళి పర్వదినం కల్లా జియో 5 జీ సేవలు : కీలక ప్రకటన చేసిన ముకేశ్ అంబానీ

జియో 5 జీ సేవలకు సంబంధించి రిలయన్స్ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. దీపావళి పండగ కల్లా కీలక నగరాల్లో 5జీ సేవలు తీసుకొస్తామని ప్రకటించారు. ముందు ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్ కతా సహా పలు నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ముకేశ్ అంబానీ సారథ్యంలో రియలన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేవం జరిగింది. ఇందులో 5 జీ సేవలు, రిలయన్స్ భవిష్యత్తుతో పాటు ఇతర విషయాలను చర్చించారు. ప్రతి నెలా ఈ సేవలను విస్తరించుకుంటూ వెళ్తామని అన్నారు. 2023 డిసెంబర్ కల్లా దేశంలోని ప్రతి పట్టణం, మండలంలో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయని కీలక ప్రకటన చేశారు. ఇందుకోసం 2 లక్షల కోట్లు వెచ్చించామని ముకేశ్ వెల్లడించారు.

 

రిలయన్స్ భవిష్యత్ లీడర్లను కూడా ప్రకటించిన అంబానీ

ఈ కీలక సమావేశం సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేవారు. ఇకపై జియో బాధ్యతలను ఆకాశ్ అంబానీ చూసుకుంటారని, ఇషా అంబానీ.. రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని చూసుకుంటారని, అనంత్ అంబానీ రిలయ్న్ న్యూ ఎనర్జీ బాధ్యతలు చూసుకుంటారని ముకేశ్ వెల్లడించారు.

Related Posts

Latest News Updates