Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రాజధానిలో 1797 గృహాల క్రమబద్దీకరణ

దేశ రాజధాని వాసులకు శుభవార్త. న్యూ ఢిల్లీలో అనధికార గృహాలు, కాలనీల నివాసితులకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఢిల్లీలోని 1,797 కాలనీలను క్రమబద్దీకరించేందుకు నెల రోజుల్లో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలిసింది.
ఈ గృహాలను అమ్ముకోవచ్చు..
క్రమబద్దీకరణ అంశం మీద ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసును కేంద్రం ఆమోదించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో దాదాపు 30 శాతం జనాభా ఈ అనధికార కాలనీల్లోనే నివాసముంటున్నట్లు ఢిల్లీ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. క్రమబద్దీకరణ కారణంగా ఆయా గృహాల్లోని యజమానులు వీటిని విక్రయించగలుగుతారు. బ్యాంక్‌లు రుణాలు మంజూరు చేస్తాయి కూడా. అంతేకాకుండా ఆయా కాలనీల్లో రోడ్లు, నీరు వంటి మౌలిక సదుపాయాల ఏర్పాట్లు వస్తాయి.

Related Posts

Latest News Updates