Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కుటుంబ సమేతంగా గోపూజ చేసిన రుషి సునాక్… ఫొటోలు వైరల్

బ్రిటన్ ప్రధాన మంత్రి పదవి కోసం పోటీపడుతున్న రిషి సునాక్‌ గోపూజ నిర్వహించారు. భార్య అక్షతా మూర్తితో కలిసి లండన్‌లోని ఓ గోశాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. భార్యాభర్తలిద్దరూ రంగులతో అలంకరించిన ఆవుకు హారతి ఇచ్చి.. పూజలు చేశారు. అది మన గొప్ప సాంస్కృతిక వారసత్వం గురించి మనం గర్వపడాలి అంటూ ఓ ట్విటర్‌ యూజర్‌ ఆ వీడియోను పోస్ట్‌ చేశారు. లండన్‌ శివారులో జన్మాష్టమి వేడుకల సందర్భంగా భక్తివేదాంత్‌ మనోర్‌లో జరిగిన పూజలకు రిషి సునాక్‌ తన సతీసమేతంగా హాజరయ్యారు. భగవద్గీత తనపై ఎంత ప్రభావం చూపిందన్నది రిషి సునాక్‌ ఈ సందర్భంగా వివరించారని.. మనోర్‌ తన అధికారిక పేజీలో వివరించింది. ఇక…. రుషి సునాక్ గత ఏడాది దీపావళి పండుగను తన అధికారిక నివాసంలో జరుపుకున్నారు. నూనె దీపాలను వరుసగా వెలిగించారు. దీంతో భారతీయులంతా ఆయనను మెచ్చుకున్న విషయం విదితమే.

Related Posts

Latest News Updates