Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఇంటి మీద హరితవనం

బోడుప్పల్‌ ఆంజనేయనగర్‌ కాలనీలోని వై జంక్షన్‌ వద్ద ఉన్న గాదె రమణారెడ్డి భవనంపై వివిధ రకాల మొక్కలతో కూడిన వనం దర్శన మిస్తోంది. రమణారెడ్డి, శ్రీలత దంపతులు ఔషధ మొక్కలు, పూల, పండ్ల, ఆకుకూరలు మొక్కలను పెంచుతున్నారు. క్రిమిసంహారక మందులకు దూరంగా ఉండే పండ్లు, కూరగాయలు వాడుతున్నారు. వారికి సరిపోగా మిగిలిన వాటిని వారి ఇంటి పక్కల వారికి, స్నేహితులకు ఉచితంగా అందజేస్తున్నారు.
ఆర్గానిక్‌ ఎరువులు వాడుతూ..
భవనంపై ఉన్న మొక్కలకు ఆర్గానిక్‌ ఎరువులు వాడుతూ డిప్‌ ఇరిగేషన్‌ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కాలనీవాసులకు డాబాలపై పెంచి మొక్కలపై అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్‌ వాడకంపై నో ప్లాస్టిక్‌ అనే నినాదంతో ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఏమేం పండిస్తారు..
టమోట, మిర్చి, వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, కాకర, చిక్కులు, క్యాబేజీ క్యాలీప్లవర్‌ కూరగాయల మొక్కలున్నాయి. అలాగే మామిడి, సపోట, నిమ్మ, ఆరెంజ్, స్టార్‌ప్రూట్, అరటి పండ్ల మొక్కలు, షుగర్‌ మొక్కలు, తులసి, కలబంద, సబ్జా వంటి ఔషధ మొక్కలు పెంచారు. పోకబంతి, సూది బంతి, చేమంతి, గులాబి, కాగితాల పువ్వులు వంటి అన్ని రకాల పూల మొక్కలను పెంచుతున్నారు.

Related Posts

Latest News Updates