Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

గౌడవల్లిలో సాకేత్‌ రిటైర్మెంట్‌ హోమ్స్‌

హైదరాబాద్‌లో తొలి రిటైర్మెంట్‌ హోమ్స్‌ ప్రాజెక్ట్‌ కాప్రాలోని ప్రణామ్‌. 4.5 ఎకరాల్లో 333 రిటైర్మెంట్‌ హోమ్స్‌లను నిర్మించి సాకేత్‌ గ్రూప్‌! ఇప్పుడిదే నిర్మాణ సంస్థ మరొక అద్భుతమైన ప్రాజెక్ట్‌తో నగరవాసుల ముందుకొచ్చింది. కొంపల్లి దగ్గర్లోని గౌడవల్లిలో 5.29 ఎకరాల్లో ప్రణామం పేరిట రిటైర్మెంట్‌ హోమ్స్‌లను నిర్మిస్తోంది. ప్రాజెక్ట్‌ నిర్మాణం, వసతులు అన్నింటినీ పెద్దలు సులువుగా వినియోగించుకునేలా అభివృద్ధి చేస్తోంది.
5.29 ఎకరాల్లో ప్రణామం..
గౌడవల్లిలో భూఃసత్వ పేరిట 80 ఎకరాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో మూడు దశల్లో కలిపి 600ల విల్లాలను నిర్మించనుంది. ఇప్పటికే ఫేజ్‌–1లో 220 ప్రీమియం విల్లాలను నిర్మించింది. వీటిల్లో సుమారు వందకు పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి కూడా. భూఃసత్వ పక్కనే 5.29 ఎకరాల్లో ప్రణామం పేరిట రిటైర్మెంట్‌ హోమ్స్‌ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో నాలుగు బ్లాక్స్‌లో కలిపి 481 గృహాలుంటాయి. ఒక్కో టవర్‌ జీ+10 అంతస్తులుంటుంది. తొలి దశలో ‘ఏ’ బ్లాక్‌లో 197 ఫ్లాట్లను నిర్మిస్తున్నాం. ఫ్లాట్ల విస్తీర్ణాలు 448 చ.అ. స్టూడియో అపార్ట్‌మెంట్‌ నుంచి 1,857 చ.అ. 3 బీహెచ్‌కే వరకుంటాయి.
మార్చి నుంచి గృహ ప్రవేశాలు షురూ..
ప్రాజెక్ట్‌లో 30 శాతం బిల్టప్‌ ఏరియా, 70 శాతం ఓపెన్‌ స్పేస్‌ ఉంటుంది. ప్రస్తుతం శ్లాబ్‌ పనులు, 6 అంతస్తుల వరకు బ్రిక్‌ వర్క్‌ పూర్తయింది. వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణ పనులను పూర్తి చేసి కొనుగోలుదారులకు అప్పగిస్తాం. ప్రణామం ప్రాజెక్ట్‌ ప్రక్కనే నివాసితులు సేద తీరేందుకు చిట్టడవిని అభివృద్ధి చేస్తున్నాం. 100/16 ఫీట్ల ఎత్తున్న చెట్లను పెంచుతున్నాం. రెండేళ్లలో చెట్ల ఎదుగుదలతో ఈ ప్రాంతమంతా పచ్చని పర్యావరణంతో నిండిపోతుంది.
25 వేల చ.అ.ల్లో వెల్‌నెస్‌ హబ్‌ నిర్మాణం..
ప్రణామంలోని వసతులను పెద్దలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేస్తున్నాం. 25 వేల చ.అ.ల్లో వెల్‌నెస్‌ హబ్‌ను నిర్మిస్తున్నాం. ఎంట్రెన్స్, లిఫ్ట్, మెట్ల మార్గంలో విశ్రాంతి తీసుకునేందుకు గదులు, చెయిర్స్‌ వంటివి ఉంటాయి. 24 గంటలు సెక్యూరిటీ, మెడికల్‌ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. అత్యవసర సేవల కోసం ప్యానిక్‌ బజర్స్, కారిడార్స్, బాత్‌రూమ్స్‌ల్లో గ్రాబ్‌ బార్స్, యాంటిస్కిడ్‌ ఫ్లోరింగ్, ఫిజియోథెరపీ, నర్సు, అంబులెన్స్, ఆక్యుపెంచర్‌ వంటివి ఉంటాయి.
– నివాసితులు ప్రాజెక్ట్‌లో తిరిగేందుకు వీలుగా బ్యాటరీ కారు ఉంటుంది. వాకింగ్, జాగింగ్‌ ట్రాక్స్, ఆంపి థియేటర్, పార్క్, జిమ్, స్విమ్మింగ్‌ పూల్, లైబ్రరీ, యోగా, మెడిటేషన్‌ హాల్, ఇండోర్‌ గేమ్స్, ఏసీ డైనింగ్, కాఫీ షాపు, ల్యాండ్రీ, హౌస్‌కీపింగ్, గెస్ట్‌ రూమ్స్, మల్టీపర్పస్‌ పార్టీ హాల్‌ వంటి వసతులుంటాయి. విశాలమైన పార్కింగ్‌ ఏర్పాటు, సుమారు 420 కార్లు పార్కింగ్‌ చేసుకోవచ్చు. భూఃసత్వ ప్రాజెక్ట్‌ ప్రధాన మార్గంలో సూపర్‌ మార్కెట్‌ ఉంటుంది. భూఃసత్వ ప్రాజెక్ట్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఎగ్జిట్‌ నంబర్‌ 6)కు అర కిలోమీటర్‌ దూరం. దీంతో ప్రధాన నగరంలోకి లేదా ఇతర జిల్లా కేంద్రాలకు వెళ్లడం సులువు.

బొమ్మాయి, మర్రికుంట చెరువుల అభివృద్ధి
– జి. రవికుమార్, డైరెక్టర్, సాకేత్‌ గ్రూప్‌
ప్రభుత్వ అనుమతిస్తే గౌడవల్లిలోని బొమ్మాయి చెరువు, మర్రికుంట చెరువులను అభివృద్ధి చేస్తాం. ఆయా చెరువులను శుభ్రం చేయడంతో పాటూ పార్క్‌లు, చెట్లు, వాకింగ్, జాగింగ్‌ ట్రాక్స్, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా వంటివి ఏర్పాటు చేస్తాం. ఆయా వసతులకు సంబంధించిన డిజైన్స్‌కు రూపొందించాం.

Related Posts

Latest News Updates