Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

‘శభాష్ మిథు’ ట్రైలర్ విడుదల… క్రికెటర్ గా తాప్సీ

ఇండియన్ క్రికెటర్స్ బయోపిక్స్ ఇప్పటికే కొన్ని వచ్చాయి. ధోనీ, అజారుద్దీన్ జీవిత చరిత్రలతో ఉన్న సినిమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. తాజాగా.. క్రికెట్ కు సంబంధించిన మరో బయోపిక్స్ వెండితెరపై కనిపించబోతోంది. ఈసారి ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సక్సెస్ స్టోరీ జనం ముందుకు రానుంది. శభాష్ మిథు పేరుతో తెరకెక్కింది. దీనిలో హీరోయిన్ తాప్సీ హీరోయిన్. శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. వయకాం 18 స్టూడియోస్ దీనిని నిర్మించింది. జూలై 15న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ను తాప్సీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మిథాలీ రాజ్.. మీకందరికీ తెలుసు. ఆమె లెజెండ్ గా మారడానికి వెనకున్న కథను చూడడానికి సిద్ధంగా వుండండి. ఓ మహిళ క్రికెటర్ గా రాణించి, చరిత్రనే నెలకొల్పారు. మిథాలీ కథను మీ ముందుకు తెస్తున్నందుకు గర్వంగా వుంది అంటూ తాప్సీ పేర్కొన్నారు.

ఇక.. మిథాలీ రాజ్ కూడా ఈ ట్రైలర్ ను సోషల్ మీడియాలో పెట్టారు. నా కల, నా కథను అందరికీ చెప్పడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. ఈ చిత్ర బృందానికి రుణపడి వుంటాను అంటూ మిథాలీ రాజ్ చెప్పుకొచ్చారు.

Related Posts

Latest News Updates