Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఇళ్ల పట్టాల కోసం 30 ఏళ్లుగా ఎదురుచూపులు!

సింగరేణి అనగానే మనకు గుర్తుకు వచ్చేది బొగ్గుగణి కార్మికులు. కానీ ఇక్కడ బొగ్గు గణిలో పని చేయకున్న అంతేస్థాయిలో కార్మికులు చెమట చుక్కలను చిందిస్తుంటారు. ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని ముపై ్ప ఏళ్ల క్రితం వేల సంఖ్యలో పేద కుటుంబాలు ఇక్కడికి వచ్చి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అప్పటి నుంచి పట్టాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు సింగరేణి బస్తీ ప్రజలు.
3 వేల కుటుంబాల ఎదురుచూపులు..
ఇందిరా సేవాసదన్‌ డివిజన్‌ సింగరేణి బస్తీలో సుమారు 3 వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వీరంత 30 ఏళ్ల క్రితం నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి పని కోసం వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. సొంత గ్రామాల్లో పని లేక ఊరు, వాకిలి వదిలేసి కుటుంబంతో కలిసి ఇక్కడి వచ్చి గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ఇక్కడి వారంత దినసరి కూలీలు, ఆటో డ్రైవర్లు, కొందరు మహిళలు ఇళ్లలో పాచి పనులు చేస్తుంటారు. మరి కొందరు జీహెచ్‌ఎంసీలో చెత్తను తరలించే వాహనాలకు డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఇక్కడి వారకి ప్రభుత్వం అందజేసిన ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటరుకార్డు ఇలా ప్రతి ఒక్కటి ఉన్నాయి. కాగా 2003లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో గుడిసెలు కాలి బూడిదయ్యాయి. దీంతో వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ మహానేత వై.ఎస్‌ రాజశేఖర్‌రెడ్డి స్థల యజమానులతో మాట్లాడి సుమారు 3024 ఇళ్లు కట్టిస్తామని మాటిచ్చారు. ఇందులో 1792 మంది కుటుంబాలకు సొంతిళ్లు కట్టించి ఇచ్చారు. మిగతా ఇళ్లు నిర్మాణం జరుగుతుండగానే అక్కడి స్థలం యజమానులు కోర్డుకెళ్లి స్టే తేవడంతో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. అయితే అప్పటి నుంచి కూడ ఇది ప్రయివేటు స్థలం అంటు కొందరు కోర్టుకు వెళ్లారు. హైకోర్టు కూడ గుడిసెలు ఖాళీ చేయాలని అప్పట్లో తీర్పు ఇచ్చింది. కానీ బస్తీ పెద్దలు సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు. పట్టాలు ఇవ్వాలని బస్తీ వాసులు నెల రోజుల పాటు నిరహారదీక్షలు సైతం చేపట్టారు గుడిసెలు ఖాళీ చేయించే ప్రయత్నంలో పోలీసులకు, బస్తీ వాసులకు యుద్దమే జరిగింది. దీంతో పోలీసులే వెనుకడుగు వేశారు.

ఎన్నికలప్పుడే గుర్తుకు వచ్చేది..
అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చిన అందరికి గుర్తుకు వచ్చేది మాత్రం సింగరేణి బస్తీ ప్రజలు. అంతేనా నగరంలో ఏ పార్టీ బహిరంగ సభ పెట్టిన ఇక్కడి నుంచే ప్రజలను తరలిస్తారు. ఏ రాజకీయ నాయకుడు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఇక్కడి ప్రజలకు పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇవ్వడం అటు తర్వాత మొఖం చాటేయడం పరిపాటిగా మారింది. కాగా గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మాజీ మంత్రి కేటీఆర్‌ ఇక్కడికి వచ్చినప్పుడు సింగరేణిని దత్తత తీసుకోని అభివృద్ది చేస్తానని మాట ఇచ్చి వెళ్లారు. అంతే కాదు మీ అందరికి పట్టాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ అది ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. గెలిచిన కార్పొరేటర్‌ సామ స్వప్నారెడ్డి కూడ ఇక్కడి ప్రజలను కేటీఆర్‌ను కలిపించి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవడం లేదని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బస్తీ ప్రజల్లోను ఐక్యత కరువు..
సింగరేణి బస్తీలో నివసించే ప్రజల్లో కూడ ఐక్యత లోపించింది. ఎవరికి వారు వర్గాలుగా విడిపోయి హక్కుళ గళం వినిపిస్తున్నారు. బస్తీలో మెజార్టీ ప్రజలు మాకు ఉన్న చోటే పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుంటే, మరికొందరు మాత్రం డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టించి ఇవ్వాలని అడుగుతున్న వారు కూడా ఉన్నారు. ఇంకొందరు ఎక్కడైన స్థలం ఇచ్చి ఇళ్లు కట్టుకోడానికి నిధులు ఇస్తే వెళ్లిపోతామని అనే వారు కూడ కొంత మంది ఉన్నారు. అయితే కొందరు రాజకీయ నాయకులు వీరి అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దాగుడు మూతలు ఆడుతున్నారు. బస్తీ ప్రజలల్లో వర్గాలను పెంచిపోషిస్తున్నారు. డబ్బులు ఆశ చూపి గల్లీ లీడర్ల చేత మభ్య పెట్టే ప్రయత్నం నేటికి కొనసాగుతూనే ఉంది. ఈ గల్లీ లీడర్లు కూడ అప్పుడప్పుడు తెర మీదకు వస్తున్నా కారణం ఎంటో గానీ అటు తర్వాత గప్‌చుప్‌ అవుతున్నారు. మొత్తానికి బస్తీ ప్రజలను అందరు కలిసి అయోమయానికి గురి చేస్తున్నారు. బస్తీ ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చి ఒకే గళం వినిపంచినప్పుడే సమస్య పరిష్కారం అవుతుందనే విషయాన్ని గ్రహించాలి.
మాకు పట్టాలే కావాలి..
మాకు డబుల్‌ బెడ్‌రూమ్‌లు అవసరం లేదు. మేమున్న చోటే పట్టాలు ఇప్పించాలని సింగరేణి కాలనీ అధ్యక్షులు తుకారం నాయక్‌ తెలిపారు. అప్పటి వరకు మా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. కానీ కొందరు రాజకీయ నాయకులు కావాలని మా మధ్య చిచ్చుపెట్టి కుట్ర చేస్తున్నారు. ఈ క్రమంలో సొసైటి వాళ్లతో కుమ్మకై డబ్బులకు అమ్ముడు పోతున్నారు. ఎవరెన్ని చెప్పినా మాకు మాత్రం పట్టాలు ఇవ్వాలనే అనే విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలి.

Related Posts

Latest News Updates