Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఘనంగా ఘంటసాల శతగళార్చన..

అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకుడు, మరియు స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సందర్భంగా వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితం అనే నినాదంతో శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో 150 పైగా టీవీ చర్చ కార్యక్రమాలు నిర్వహించిన విషయం మీ అందరికీ తెలిసినదే… ఈ పరంపరలో భాగంగా ముఖ్య అతిథిలుగా ప్రముఖ దర్శకుడు సుకుమార్, ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, ప్రముఖ రచయిత, నటులు దర్శకులు తనికెళ్ళ భరణి, ప్రముఖ గేయ రచయితలు చంద్రబోస్ మరియు అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్న ఈ ప్రత్యేక కార్యక్రమము, 10 మంది సహ నిర్వాహకులు అయిన విజు చిలువేరు, రత్న కుమార్ కవుటూరు, శారద ఆకునూరి, రెడ్డి ఉరిమిండి, రామ్ దుర్వాసుల, ఫణి డొక్కా, శ్యాం అప్పాలి, నీలిమ గడ్డమణుగు, జయ పీసపాటి, శ్రీలత మగతల తో కలసి ప్రపంచ వ్యాప్తంగా 100 మంది పైగా గాయకులు / గాయనీమణులు తో ఘంటసాల శత గళార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించామని, మొదటి భాగాన్ని 21 ఆగష్టు నాడు ప్రసారం చేయడం జరిగింది నిర్వాహకులు తెలియజేశారు… మిగతా మూడు భాగాలు 28 ఆగస్టు, 4 సెప్టెంబర్, మరియు 11 సెప్టెంబర్ లో ప్రసారం చేయబడుతుంది.

ఘంటసాల స్వగృహంలో వారి కోడలు కృష్ణ కుమారి పూజా కార్యక్రమంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం, తదనంతరం వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం ఘంటసాల రత్నకుమార్ నూరు కేంద్రాల్లో శతజయంతి కార్యక్రమాన్ని చేయాలనీ అనుకున్నారని, అనుకోకుండా వారు మనల్ని విడిచి వెళ్లిపోవడం, నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని తమ భుజస్కందాలమీద వేసుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం చేస్తున్న కృషి మా కుటుంబానికి చాల సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అలాగే మాష్టారు మొదటి వీరాభిమాని తానే అని. వారి కుటుంబంలోకి రావడం పూర్వజన్మ పుణ్యమని తెలియచేసారు. ఘంటాసాల సతీమణి సావిత్రమ్మ పంపిన సందేశం లో ఇంత గొప్ప కార్యక్రమాన్ని మాష్టారు అక్కడ ఉన్నట్లే భావించి జరుపుకోవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని తెలియచేసారు. ఇంతటి బృహత్కార్యాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

మొదటి భాగంలో పాల్గొన్న ముఖ్య అథిదులు తనికెళ్ళ భరణి మాట్లాడుతూ ఇంతటి విశ్వవేదికని పంచుకుంటున్న అందరికీ అభినందనలు తెలుపుతూ.. వారి మిథునం సినిమాలో ఒక సన్నివేశంలో వచ్చిన ఘంటసాల ఆలపించిన పుష్పవిలాపం గురించి గుర్తు చేసుకున్నారు. ఇప్పటికి వారి పాటతోనే అందరు మేల్కొంటారని, వారి నడయాడిన ఊరుని సందర్శించినప్పుడు ఒక అనిర్విచమైన అనుభూతిని పొందానని చెపుతూ ఘంటసాల ఒక పరిపూర్ణ గాయకుడు, మంచి సంస్కారం గల మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఎప్పుడో 48 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయిన వ్యక్తి కోసం వారికి భారతరత్న రావాలని అలుపెరగని పోరాటం చేస్తున్న నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందించారు…

ప్రముఖ సినీ దర్శకులు సుకుమార్ మాట్లాడుతూ. ఘంటసాల మనందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు అని చెప్పడానికి నిదర్శనం ఇప్పటికి ప్రతి ఊరూ ఘంటాసాల పాటతోనే మేల్కొంటుంది అని పేర్కుంటూ తాను విన్న మొదటి గొంతు ఘంటసాలది అని తెలిపారు. చిన్నప్పుడు తన ఊరిలో దేవాలయంలో వారి పాట “నడిరేయి ఈ జాములో” అన్న పాటతోనే మేల్కోవడం జరుగుతుందని అని పేర్కుంటూ, ప్రతి ఊరిలో ఘంటసాల పాటలు పాడేవారు ఒక్కరయినా ఉంటారని, వారికి ఆ ఊరులో ప్రత్యేకస్థానం, గౌరవం ఉంటుందని చెపుతూ. ఘంటసాల శతజయంతి సందర్భంగా వారికి భారత రత్న ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పారు.

 

ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్య స్పందన లభిస్తోందని నిర్వాహకులు తెలిపారు, వివారాలు మీ అందరి కోసం: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru
ఈ కార్యక్రమలో పాల్గొన్న అందరికి బాలరెడ్డి ఇందుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియ చేసారు. ఎవరైనా ఈ కార్యక్రమానికి సహాయం చేయాలనుకుంటె ఈ అడ్డ్రస్సు కి ghantasala100th@gmail.com వివరాలు పంపగలరు.

Related Posts

Latest News Updates