తెలుగు సింగర్, బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ ఇంట్లో సంబరాలు ప్రారంభమయ్యాయి. రేవంత్ భార్య అన్విత నేడు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అన్విత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే… రేవంత్ ప్రస్తుతం హౌస్ లోనే వున్నాడు. రేవంత్ బిగ్బాస్ హౌస్లోకి వెళ్లకముందే అన్విత గర్భవతి. ఆయన హౌస్లో ఉన్న సమయంలోనే ఆమె సీమంతం కూడా జరిగింది. కాగా.. అన్విత షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఎంతోమంది సినీ ప్రముఖులతో పాటు నెటిజన్లు సైతం రేవంత్-అన్విత దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిన్నప్పుడే తాను తండ్రిని కోల్పోయానని, ఆ బాధ తనకు తెలుసని, అందుకే నాన్న అని పిలిపించుకోవాలని చాలా ఎదురు చూస్తున్నానని రేవంత్ చాలా సార్లు చెప్పాడు.
CONGRATULATIONS REVANTH for THE baby girl blessed.#Revanth bro, baby girls always bring luck 🤞
Wishing Mother Nd Baby Have Healthy Life In Future ❤️#BalaAditya ll #BiggBossTelugu6 pic.twitter.com/7Yc2zT9AlW— BalaAdityaFC (@ursBalaAdityaFC) December 2, 2022