Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఏడాదిలో 1,500 ఎకరాల అభివృద్ధి!

షాద్‌నగర్, కొత్తూరు వంటి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో లే–అవుట్‌ చేసి.. సొంతింటి కలను నెరవేరుస్తున్న నిర్మాణ సంస్థ స్పేస్‌ విజన్‌… ఈ ఏడాది 1,500 ఎకరాలను అభివృద్ధి చేయాలని లక్ష్యించింది. సదాశివపేట, బాలానగర్, షాద్‌నగర్, కొత్తూరు, బాలాపూర్, రంగారెడ్డిగూడ ప్రాంతాల్లో లే–అవుట్‌ ప్రాజెక్ట్‌లను చేయనుంది. సదాశివపేటలో ఆంబియెన్స్‌ రెసిడెన్షియల్‌ ప్లాట్‌ ప్రాజెక్ట్‌ను నేడు ప్రారంభించనుంది. ఈ సందర్భంగా స్పేస్‌ విజన్‌ గ్రూప్‌ సీఎండీ టీవీ. నరసింహా రెడ్డి మాట్లాడారు.
డీటీసీపీ అనుమతితో సదాశివపేటలో మెగా రెసిడెన్షియల్‌ వెంచర్‌ను చేస్తున్నాం. ఫేజ్‌–1లో 120 ఎకరాలు, ఫేజ్‌–2లో 100 ఎకరాలను అభివృద్ధి చేయనున్నాం. బాలానగర్‌లో వంద ఎకరాలో లే–అవుట్‌ను చేయనున్నాం. బాలాపూర్‌లో వంద ఎకరాల్లో జీహెచ్‌ఎంసీ లే–అవుట్‌ను చేస్తున్నాం. ఇందులో వ్యక్తిగత గృహాలను అభివృద్ధి చేస్తాం. కొత్తూరులో హెచ్‌ఎండీఏ అనుమతితో 60 ఎకరాల్లో వెంచర్‌ను చేయనున్నాం. రంగారెడ్డిగూడలో 200 ఎకరాల్లో లే–అవుట్‌ను అభివృద్ధి చేయనున్నాం.

ఇప్పటివరకు లే–అవుట్లను అభివృద్ధి చేసిన స్పేస్‌ విజన్‌ గ్రూప్‌ తొలిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. జూబ్లిహిల్స్‌ కేంద్రంగా అస్పైర్‌ స్పేస్‌ పేరిట కొత్త కంపెనీ పెట్టి కన్‌స్ట్రక్షన్స్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాం. మాదాపూర్‌లోని శిల్పారామం ప్రక్కన 60 వేల చ.అ.ల్లో తొలి కమర్షియల్‌ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నాం. ఇందులో మూడంతస్తుల్లో పార్కింగ్, పై అంతస్తులో రిటైల్, చివరి అంతస్తులో రెస్టారెంట్‌ ఉంటుంది. మియాపూర్‌లో 16.80 లక్షల చ.అ.ల్లో మెగా రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్స్‌ను నిర్మించనున్నాం. ఇందులో సుమారు వెయ్యి గృహాలను నిర్మించనున్నాం. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) ప్రాజెక్ట్‌ ఇది. క్రెడిట్‌ లింక్‌ సబ్సిడీ (సీఎల్‌ఎస్‌ఎస్‌) కింద కొనుగోలుదారులకు రూ.3.5 లక్షల వడ్డీ రాయితీ వస్తుంది.

టీఎస్‌ రెరా అనుమతులతోనే..
స్పేస్‌ విజన్‌ నుంచి అభివృద్ధి చేసే ప్రతి ప్రాజెక్ట్‌ తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు తీసుకొని, రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో నమోదు చేసి మరీ క్రయవిక్రయాలు జరుపుతున్నాం. మా కంపెనీలోని ఇతర ప్రమోటర్లు, మార్కెటింగ్‌ ఏజెన్సీలు కూడా టీఎస్‌–రెరాలో నమోదు చేసుకోవాల్సిందేనని స్పేస్‌ విజన్‌ గ్రూప్‌ సీఎండీ టీవీ. నరసింహా రెడ్డి అన్నారు.

Related Posts

Latest News Updates