ఇసుకను అమ్ముకునేందుకు స్థలం కేటాయింపుకు కృషి చేస్తానని కొత్తపేట బిల్డింగ్ మెటీరియల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్తపేట బిల్డింగ్ మెటీరియల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం మన్సూరాబాద్‌లోని ఎస్కే గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ బిల్డింగ్ మెటీరియల్ లారీ ఓనర్స్ల సమస్యలు ఏ ప్రభుత్వం వచ్చిన తీర్చలేదని, సమస్యలు అంత జఠిలంగా ఉన్నాయన్నారు. లారీల పార్కింగ్ సమస్య ఉందని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బిల్డింగ్ మెటీరియల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయ నిర్మాణానికి స్థల సేకరణకు కృషి చేస్తానని, వారి మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. లారీల యాక్సిడెంట్టు జరిగినప్పుడు లారీలను విధ్వంసం చేస్తే చట్ట రీత్యా నేరమని, విధ్వంసం చేసిన వారిపై చర్యులుంటాయన్నారు. లారీలను ధాన్యం, వినాయక నిమజ్జనం లాంటి అవసరాలకు ఉపయోగించినప్పుడు సరైన కిరాయి ఇవ్వటం లేదని, ప్రభుత్వంతో చర్చించి మార్కెట్లో ఉన్న కిరాయిని ఇప్చించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నర్రి లింగం, ప్రధాన కార్యదర్శి కుండి సత్తయ్య, కోశాధికారి నర్రి అంజయ్య, ఉపాధ్యక్షులు నర్రి లింగం, మందుల సత్తయ్య, కార్యనిర్వహక కార్యదర్శులు బతగోని యాదయ్య, బాలరాజు మల్లేష్, సహాయ కార్యదర్శులు చాపల నర్సింహ్మ, మాలిగ లింగయ్య, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.