దక్షిణాదికి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ సుమధుర గ్రూప్ హైదరాబాద్‌లో సూపర్ లగ్జరీ నివాస సముదాయాన్ని ప్రారంభించింది. రూ.300 కోట్ల నిర్మాణ వ్యయంతో కొండాపూర్‌లో 5.04 ఎకరాల్లో సుమధుర హోరిజాన్ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. ఈ మేరకు శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుమధుర గ్రూప్ సీఎండీ జి. మధుసూధన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌లో నాలుగు టవర్లలో కలిపి మొత్తం 486 యూనిట్లుంటాయని, తొలి రోజు ప్రీ లాంచ్‌లోనే 150కి పైగా గృహాలు విక్రయమయ్యాయని తెలిపారు. 1,325 చ.అ. నుంచి 2,710 చ.అ. మధ్య 2, 3, 3.5 బీహెచ్‌కే యూనిట్లుంటాయి. ప్రాజెక్ట్ విస్తీర్ణంలో 72 శాతం ఓపెన్ స్పేసే ఉంటుంది. 28 వేల చ.అ.ల్లో క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బిలియర్డ్స్, ఏరోబిక్స్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులంటాయి. సుమధుర గ్రూప్ బ్రాండ్ అంబాసిండర్‌గా ఇండియన్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.