Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పాఠశాలల్లోనే హిజాబ్ వద్దంటున్నారు.. మొత్తం నిషేధించలేదు : సుప్రీం కీలక వ్యాఖ్య

హిజాబ్ విషయంలో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. దుస్తులు ధరించే హక్కు వుందంటే… విప్పే హక్కూ వున్నట్లేనా? అంటూ కర్నాటక పాఠశాలల్లో హిజబ్ ఆంక్షలపై వ్యాఖ్యానించింది. హిజాబ్ పై దాఖలైన పిటిషన్లపై విచారణ చేస్తూ సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ముస్లిం బాలికలు హిజాబ్ ధరించడాన్ని అనుమతినిస్తూ కేంద్రీయ విద్యాలయాలు జారీ చేసిన ఉత్తర్వులను పిటిషనర్ల తరపున న్యాయవాది ఉదహరించారు. ఈ మాట రాగానే… ధర్మాసనం జోక్యం చేసుకుంది. హిజాబ్ ను ఎవ్వరూ నిషేధించలేదు. పాఠశాలల్లో మాత్రమే నిషేధించారు. మిగతా చోట్ల మీకు కావాల్సిన చోట ధరించవచ్చు అని పేర్కంది. మతపరమైన అంశాలకు సంబంధించి ప్రత్యేక ప్రదేశాలు ఉన్నాయని, స్కూల్​లో అందరు విద్యార్థులు ఒకే యూనిఫాం ధరించాల్సి ఉంటుందని బెంచ్​ పేర్కొంది. విచారణకు న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.

Related Posts

Latest News Updates