Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సుప్రీం కోర్టు చరిత్రలోనే తొలిసారిగా… ప్రత్యక్ష ప్రసారం

సుప్రీం కోర్టు చరిత్రలోనే తొలిసారిగా కేసుల ప్రత్యక్ష ప్రసారం నడిచింది. ఈ ప్రత్యక్ష ప్రసారంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఉచిత పథకాలకు సంబంధించిన వాదనలు విన్నారు. ప్రధాన న్యాయమూర్తి పదవికి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విమరణ చేయనున్న నేపథ్యంలో ఈ లైవ్ స్ట్రీమింగ్ కొనసాగింది. ఈ ప్రత్యక్ష ప్రసారం అన్ని కోర్టుల నుంచీ సాగితే బాగుటుందని సీజేఐ ఆకాంక్షించారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీల అంశం తేల్చేందుకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 2013 నాటి తీర్పును పున: పరిశీలించేందుకు ఆమోదం కూడా తెలిపింది. ఈ ఉచిత హామీల అమలుపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని, ధర్మాసనం ఏర్పాటు విషయంలో తదుపరి సీజేఐ జస్టిస్ లలిత్ తుది నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.

 

ఇక… యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు సుప్రీం లో ఊరట లభించింది. 2007 గోరఖ్ పూర్ అల్లర్ల కేసులో వాదనలు విన్నారు. ఈ కేసులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను విచారించాల్సిన అవసరం లేదని గతంలో తీర్పు వచ్చింది. కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను జస్టిస్ ఎన్వీ రమణ విచారించారు. ద్వేషపూరిత ప్రసంగాల్లో యోగిని ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం లేదని, కేసును కొట్టివేస్టున్నట్లు సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ ప్రకటించారు.

Related Posts

Latest News Updates