మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సుప్రీం కోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. ఈ మేరకు సుప్రీం కీలక తీర్పునిచ్చింది. కేసును హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం ప్రకటించింది. ఈ కేసులో సాక్షులను, నిందితులను బెదిరిస్తున్నారని, కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేకా కుటుంబీకులు సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీం విచారించి, కుటుంబీకుల ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకునే, కేసును బదిలీ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
