Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ది గ్రేట్ సూర్య… ఆస్కార్ నుంచి పిలుపు అందుకున్నాడు..

ఆస్కార్ అవార్డు.. ఏ నటుడికైనా అదో మైలురాయే. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆ అవార్డును భావిస్తుంటారు. జీవితంలో ఒక్క సారైనా ఆస్కార్ కొట్టాలన్న తపన యాక్టర్ కి వుంటుంది. అలాగే ఈ అవార్డును ప్రదానం చేసే సమయంలో పాల్గొనే అవకాశం వచ్చినా ఎగిరి గంతేస్తారు. ఇప్పుడు ఈ అవకాశం స్టార్ హీరో సూర్యకు వరించింది. అలాగే బాలీవుడ్ నటి కాజోల్ కు కూడా దక్కింది.

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుగా వీరిద్దరికీ ఛాన్స్ వచ్చింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ లో ప్యానల్ సభ్యుడిగా సూర్యకు చోటు దక్కింది. ఇలా ఆహ్వానం అందుకున్న మొట్టమొదటి సౌత్ హీరో కూడా సూర్యాయే. 2022 అవార్డు ఫంక్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా 397 మందికి ఆహ్వానం రాగా.. అందులో సూర్య ఒకరు.

Related Posts

Latest News Updates