Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పుణేలో టేబుల్‌ స్పేస్‌ కొత్త వర్కింగ్‌ స్టేషన్స్‌

కో–వర్కింగ్‌ బ్రాండ్‌ టేబుల్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ పుణేలోకి ఎంట్రీ ఇవ్వనుంది. పుణేలో ప్రీమియం బిజినెస్‌ జోన్స్‌లో రెండు కొత్త వర్క్‌ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఖరాడీలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో 64 వేల చదరపు అడుగులు, యెర్‌వాడలోని టెక్‌ పార్క్‌ వన్‌లో 30 వేల చదరపు అడుగుల్లో కొత్త వర్కింగ్‌ ప్లేస్‌లు రానున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
పంచశీల్‌తో ఒప్పందం..
ఈ రెండు బిజినెస్‌ సెంటర్లలో పుణేలోని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ పంచశీల్‌ రియాల్టీతో కలిసి అభివృద్ధి చేస్తోంది. ఈ రెండు స్టేషన్లలో కలిపి సుమారు 1,150 సీట్లుంటాయి. ఆయా స్టేషన్లలో కెఫెటేరియాలు, మెడికల్‌ రూమ్స్, బ్రేక్‌ అవుట్‌ జోన్స్, రిక్రియేషనల్‌ స్పేస్, ఫిట్‌నెస్‌ సెంటర్‌ వంటి అన్ని రకాల వసతులుంటాయి. ప్రస్తుతం టేబుల్‌ స్పేస్‌లో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, పుణే నగరాల్లో సుమారు 10 లక్షల చదరపు అడుగుల వర్క్‌ ప్లేస్‌ అందుబాటులో ఉంది. 2020 నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యించినట్లు కంపెనీ తెలిపింది.

Related Posts

Latest News Updates