Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

తాజ్‌ ఫలక్‌నుమా! అత్యంత ఖరీదైన హోటల్‌!!

వరుస సెలవులు వచ్చాయంటే చాలు ప్రతి ఒక్కరూ స్థానికంగా ఉన్న పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలనో, కాస్త ఉన్నవాళ్లయితే దేశ, విదేశీ పర్యటనలు చేయడానికో ప్లాన్‌ చేస్తుంటారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవటంతో పాటూ అక్కడి వారసత్వ సంపద కూడా తెలుస్తుంది. ఎక్కడికెళ్లినా సరే భోజన వసతి కోసం స్థానికంగా ఉన్న హోటల్స్‌ మీద ఆధారపడాల్సిందే. ప్రస్తుతం మన దేశంలో ఉన్న అత్యంత విలాసవంతమైన, ఖరీదైన టాప్‌ 10 లగ్జరీ హోటల్స్‌ ఏంటో ఓసారి చూద్దాం!
తాజ్‌ ఫలక్‌నుమా, హైదరాబాద్‌
హైదరాబాద్‌ సంస్థానం ప్రధానమంత్రి నవాబ్‌ సర్‌ విఖర్‌–ఉల్‌–ఉమ్ర్‌ దీన్ని నిర్మించారు. 1884లో దీన్ని నిర్మించారు. 32 ఎకరాల్లో విస్తరించి ఉంది. 1897లో దీన్ని హైదరాబాద్‌ 6వ నిజాంకు బహుమతిగా ఇచ్చారు. 2010లో దీన్ని ఫైవ్‌ రిసార్ట్‌ ప్రాపర్టీగా దీన్ని పునరుద్ధరించారు. తాజ్‌ ఫలక్‌నుమాలో మొత్తం 60 గదులుంటాయి. ఉడెన్‌ ఫర్నీచర్‌తో అందంగా తీర్చిదిద్దారు. ఇందులో ఒక్క గది అద్దె 2,700 డాలర్లు.
ది లీలా ప్యాలెస్, ఉదయ్‌పూర్‌
ఇందులో 8 సూట్‌ రూమ్స్, 70కి పైగా హెరిటేజ్‌ రూమ్స్‌ ఉన్నాయి. ప్రతి రూమ్‌లో సంప్రదాయబద్దమైన రంగులు, ఎరుపు, బంగారు వర్ణ కార్పెట్‌తో అందంగా డెకరేట్‌ చేశారు. ఇందులో గది అద్దె 2,800 డాలర్లు.
ఒబెరాయ్‌ రాజ్‌విల్లాస్, రాజస్థాన్‌
30 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 70 ఎగ్జిక్యూట్‌ రూమ్స్, టెంట్స్, విల్లాస్‌ ఉన్నాయి. స్పా, టీవీ, వైఫై వంటి అన్ని రకాల వసతుంటాయి. లగ్జరీ, కోహినూర్‌ విల్లాలో ప్రైవేట్‌ స్విమ్మింగ్‌ పూల్‌ కూడా ఉంటుంది. ఇందులో అద్దె 3,200 డాలర్లు.
ది ఒబెరాయ్‌ ఆమ్రవిల్లాస్, ఆగ్రా
ఈ హోటల్‌ పై నుంచి చూస్తే తాజ్‌ మహల్‌ వ్యూ కనిపిస్తుంటుంది. స్పా, ప్రైవేట్‌ పూల్స్‌ వంటి అన్ని రకాల ఆధునిక వసతులతో పాటూ కరెన్సీ ఎక్స్‌చేంజ్‌ వంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో అద్దె 3,500 డాలర్లు.
ఒబెరాయ్, ముంబై
24 గంటల పాటూ స్విమ్మింగ్‌ పూల్, బార్, స్పా, ఫిట్‌నెస్‌ సెంటర్‌ వంటి వసతులుంటాయి. ఇటాలియన్‌ మార్బుల్‌తో ఇంటీరియర్‌ను డిజైన్‌ చేశారు. ఇందులో అద్దె 4,200 డాలర్లు.
ది ఒబెరాయ్‌ ఉదయ్‌విల్లాస్, ఉదయ్‌పూర్‌
ఇందులో 30 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో గార్డెన్స్‌ ఉంటుంది. సూర్య మహల్‌లో ఇండియన్, వెస్ట్రన్‌ క్యూజిన్, చాందినీ మహల్‌లో ఒపెన్‌ ఎయిర్‌ డైనింగ్‌ ఉంటుంది. ఇందులో అద్దె 4,900 డాలర్లు.
తాజ్‌ లేక్‌ ప్యాలెస్, ఉదయ్‌పూర్‌
ఇది 4 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 18 సూట్స్, 60కి పైగా గ్రాండ్‌ రూమ్స్‌ ఉన్నాయి. ప్రతి ఒక్క గది పెద్ద సైజ్‌ ఫ్లాట్‌ స్క్రీన్స్, టీవీ, వైఫై వంటి సేవలతో ఉంటుంది. ఇందులో అద్దె 5,300 డాలర్లు.
ది లీలా ప్యాలెస్, న్యూఢిల్లీ
2011 నుంచి ఇది పబ్లిక్‌ వినియోగం కోసం ప్రారంభమైంది. ఇందులో 3 రెస్టారెంట్స్‌ ఉంటాయి. జామ్‌వర్‌ ఇండియన్‌ క్యూజిన్, మెఘులో జపనీస్, లీ సర్యూలో ఇంటాలియన్‌ వంటకాలుంటాయి. ఇందులో 190 గ్రాండ్‌ రూమ్స్, 40 రాయల్‌ క్లబ్స్, 20 సూట్స్‌ ఉన్నాయి. ఇందులో అద్దె 6,300 డాలర్లు.
కుమారాకోమ్‌ లేక్‌ రిసార్ట్, కేరళ
ఇది 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. స్విమ్మింగ్‌ పూల్, ప్రైవేట్‌ స్పా, బోట్‌ రైడ్స్‌ వంటివి ఉన్నాయి. ఇందులో 60 గదులు, విల్లాలున్నాయి. ప్రతి గదిలో ఓపెన్‌ రూఫ్డ్‌ బాత్‌రూమ్‌ ఉంటుంది. ఇండోర్‌ గేమ్స్‌ కూడా ఉంటాయి. ఇందులో అద్దె 7,000 డాలర్లు.
రామ్‌బాగ్‌ ప్యాలెస్, జైపూర్‌
రాజస్థాన్‌లో రిచ్‌ హెరిటేజ్‌ ప్యాలెస్‌ రామ్‌బాగ్‌. దీన్ని 1835లో నిర్మించారు. 50 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. రాజస్థాన్‌లో అతిపెద్ద హోటల్‌ ఇదే. ఇందులో 80కి పైగా ఏసీ రూమ్స్‌ ఉంటాయి. ప్రతి రూమ్‌లో మినీ బార్, టీవీ, వైఫై వంటివి ఉంటాయి. ఇందులో అద్దె 8,400 డాలర్లు.

Related Posts

Latest News Updates