Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కుప్పం నియోజకవర్గంపై జగన్ సర్కార్ కక్షగట్టింది : చంద్రబాబు ఆరోపణ

కుప్పం నియోజకర్గంపై జగన్ ప్రభుత్వం కక్షగట్టిందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పోలీసులను అడ్డంపెట్టుకొని వైసీపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో వరుసగా మూడో రోజు చంద్రబాబు పర్యటిస్తున్నారు. సివిల్ డ్రెస్సుల్లో కొందరు పోలీసుల లాఠీలు తీసుకొని వచ్చారని, వాళ్లను ప్రోత్సహించిన వారెవ్వరో తెలియాలని, వారి పనిపడతామని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు. నేరస్థుల పాలన అంటే ఎలా వుంటుందో ఇప్పుడు ఏపీ ప్రజలు చూస్తున్నారంటూ పరోక్షంగా సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. తాము అధికారంలో వున్న సమయంలో కుప్పంలో 650 ఇళ్లతో మోడల్ కాలనీ నిర్మించామని, వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత అవి ఆగిపోయాయని విమర్శించారు.

 

పేదలపై జగన్ సర్కార్ కు కోపం వుందని, పేదవాళ్ల ఆకలి తీర్చాలని ఏర్పాటు చేసుకున్న అన్న క్యాంటీన్లను ఎందుకు ధ్వంసం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. అన్నా క్యాంటీన్లు తమిళనాడులో అద్భుతంగా కొనసాగుతున్నాయని, సీఎం స్టాలిన్ వాటిని అద్భుతంగా నడిపిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ భరత్‌ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు.. అన్న క్యాంటీన్‌ వద్ద ఎందుకు ఏర్పాటు చేయలేదని చంద్రబాబు ప్రశ్నించారు. తాను సీఎంగా ఉన్న సమయంలో ఇలా వ్యవహరించి ఉంటే ప్రస్తుత ముఖ్యమంత్రి బయట తరిగే వాడా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.

Related Posts

Latest News Updates