భాగ్యనగరవాసులకు రెండు కొత్త పార్క్‌లు ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. నాగారం, నారపల్లి ప్రాంతాల్లో రెండు అర్బన్ లంగ్స్ స్పేస్ (పార్కులు) లను ప్రారంభించేందుకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అటవీ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. నాగారం ఫారెస్ట్ బ్లాక్‌లోని 70 ఎకరాలు, నారపల్లి – పర్వాతాపూర్ ఫారెస్ట్ బ్లాక్‌లో 60 ఎకరాల్లో ఈ పార్క్‌లు రానున్నాయి. నగర ప్రజలను కాలుష్యం బారి నుంచి కాపాడటంతో పాటు ఆహ్లాదాన్ని కల్పించాలన్న వీటి లక్ష్యం.
ఒక్క పార్క్‌కు రూ.50 లక్షలు..
హరితహారంలో భాగంగా అటవీ శాఖ ఫారెస్ట్ బ్లాక్‌లను అర్బన్ లంగ్స్ స్పెస్లుగా అభివృద్ధి చేస్తోంది. ఒక్కో అర్బన్ లంగ్స్ స్పెస్ అభివృద్ధికి రూ.50 లక్షల వరకు వెచ్చిస్తోంది. ఇప్పటికే బçహుదూర్పల్లిలో ఆయుష్ వనం పార్క్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫారెస్టు బ్లాక్ చుట్టూ ఫెన్సింగ్, కందకాలు, పైర్ లైన్లు ఏర్పాటు చేసింది. అలాగే ప్లాంటేషన్‌లో కలుపు మొక్కలను ఏరివేయటం, మొక్కల పెరుగుదలను మెరుగుపర్చటానికి, సౌందర్య రూపంగా తీర్చిదిద్దెందుకు కొమ్మలను కత్తిరింపు కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించనుంది. వర్షాకాలంలో సతత హరిత జాతులతో ఫారెస్ట్ బ్లాక్ చెట్లల్లో ఖాళీలను భర్తీ చేస్తారు.
ఏడాదిలో కొత్తగా 8 పార్క్‌లు..
ఈ ఏడాదిలోగా మరో ఎనిమిది అర్బన్ లంగ్స్ స్పెస్లు అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. టీఎస్ఎఫ్డీసీ అధ్వర్యంలో గౌడవెల్లి, తూమ్కుంట, లాల్‌గడ్ మలక్‌పేట్ తదితర ఫారెస్ట్ బ్లాక్స్‌లో మూడు అర్బన్ లంగ్స్ స్పెస్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఎల్లంపేట్ ఫారెస్ట్ బ్లాక్‌లో, జీహెచ్ఎంసీ అధ్వర్యంలో గాజుల రామారం, హెచ్ఎండీఏ అధ్వర్యంలో తుర్కపల్లి, టూరిజం శాఖ అధ్వర్యంలో యాద్గార్పల్లి, ధర్మారం– ఉప్పరపల్లి ఫారెస్ట్ బ్లాక్లల్లో కొత్త అర్బన్ లంగ్స్ స్పెస్ పార్క్‌లు రానున్నాయి.