హైదరాబాద్‌కు చేరువలో ఉన్న కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం పార్కుగా అభివృద్ధి చెందనుంది. ఇప్పటికే కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుడు (ఎంపీ) జోగినపల్లి సంతోష్‌కుమార్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఎంపీ నిధులతో అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్దిలో భాగంగా ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను నిర్వíß ంచాలని నిర్ణయించామని సీఎంఓ ఓఎస్డీ ప్రియాంకా వర్గీస్ తెలిపారు. ఈ మేరకు వర్గీస్, మేడ్చల్ జిల్లా డీఎఫ్ఓ సుధాకర్‌రెడ్డి, కీసరగుట్ట దేవస్థానం అధికారులతో కలిసి కీసరగుట్ట ప్రాంతంలో పర్యటించారు.
50 హెక్టార్లలో..
కీసరగుట్టకు వచ్చే యాత్రికులకు చక్కటి ఆహ్లాదకరమైన వాతవారణాన్ని కల్పించేందుకు వీలుగా ఎకో టూరిజాన్ని అభివృద్ధి పరచనున్నారు. కుటుంబ సభ్యులతో సహా సేదతీరే ప్రాంతంగా తీర్చిదిద్ది, చిన్నారుల్లో పర్యావరణం, అటవీ, జీవవైవిద్యం ప్రాధాన్యతలపై అవగహన కల్పించేలా కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని తీర్చిదిద్దనున్నారు. తొలి దశలో సుమారు 50 హెక్టార్లలో అర్బన్ ఫార్టెస్ ఫార్కు అభివృద్ధి పరచనున్నట్లు ఆమె తెలిపారు. కీసరగుట్ట దిగువన గల ఖాళీ స్థలంతో పాటు, పెద్దమ్మ చెరువు కట్టను, కీసరగుట్ట గురుకుల పాఠశాల సమీపంలోగల ఖాళీ స్థలంలో పార్కును అభివృద్ధిపరిచేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని డీఎఫ్‌ఓకు సూచించారు.
రూ.70 కోట్ల పనులకు..
కీసరగుట్ట అభివృద్ధి కోసం రూ.70 కోట్ల ప్రతిపాదనలకు ప్రభుత్వం నుండి గ్రీన్‌సిగ్నల్ రావాల్సి ఉంది. ప్రధాన దేవాలయం సమీపంలో కుడా చిన్నస్థాయి పార్కును అభివృద్ధి చేయాలని ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ కోరారు.