Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

త్వరలోనే టీ–హబ్‌ ఫేజ్‌–2

తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు ప్రభుత్వం ప్రోత్సహించేందుకు ఎప్పుడూ ముందుంటందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ పేర్కొన్నారు. గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలోని టీహబ్‌లో వరల్డ్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జయేష్‌ రంజన్‌ మాట్లాడుతూ వినూత్న ఆలోచనలు, ప్రజాసమస్య పరిష్కారానికి తోడ్పాటు అందించే స్టార్టప్‌లకూ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు తగిన విధంగా ప్రోత్సహించేందుకు అన్నిరకాలుగా సహకరించేం దుకు ముందుంటామన్నారు. వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చి స్టార్టప్‌లను ప్రబుత్వ పరంగా ప్రోత్సహించేందుకు టీహబ్‌ను తెలంగాణలో ప్రారంభించామన్నారు. ట్రిపుల్‌టీ, ఐఎస్‌బీ, నల్సార్‌ యూనివర్శిటీల సహాకారంతో దీన్ని రూపకల్పన చేశామన్నారు. ఫేజ్‌ విజయవంతం కావడంతో ప్రస్తుతదానికంటే అయిదు రెట్లు ఎక్కువగా టీహబ్‌ ఫేజ్‌–2 త్వరలో పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామన్నారు.
50 ఇంక్యుబేషన్‌ సెంటర్స్‌..
మొదట్లో ట్రిపుల్‌ఐటీలో సీఐఈ పేరిట, ఐఎస్‌బీలో డీ ల్యాబ్‌ పేరిట ఇంకుబేటర్లు రెండే ఉండేవని, ట్రిపుల్‌ఐటీ ఇంకుబేటర్‌ ఒక విద్యాసంస్థలో దేశంలో అతిపెద్ద ఇంకుబేటర్‌ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో గత నాలుగు రోజుల క్రితం వరకు 48 ఇంకుబేటర్లు ఉన్నాయని, ఇటీవల జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో రెండు కొత్త ఏర్పాటు చేయడంతో వాటి సంఖ్య 50కి చేరిందన్నారు. ఇటీవల విజయవంతమైన 25 మంది నగరంలోని ఎంటర్‌ప్రెన్యూర్స్‌ పేరిట మేడ్‌ ఇన్‌ హైదరాబాద్‌ పేరిట పుస్తకం ప్రచురితం చేసిందని గుర్తు చేశారు. విజయవంతమైన నగర 25 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాలకు గాను 25 జిల్లాలను దత్తత తీసుకోవాలని కోరగా వారు స్వచ్చంధంగా ముందుకొచ్చి 25 జిల్లాలను దత్తత తీసుకున్నారని వివరించారు. మిగతా జిల్లాలను కూడా విజయవంతమైన ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు దత్తత ఇచ్చి ఆయా జిల్లాలలో వినూత్నంగా ఆలోచించే, ఐడియాలను రూపొందించే వారిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి..
గ్రామీణ ప్రాంతాలలో కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని, ఈ నేపథ్యంలోనే ఇటీవల ‘ఇంటింటా ఇన్నోవేటర్‌’ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి అనూహ్యస్పందన వచ్చిందన్నారు. స్టార్టప్‌లు రూపొందించి ఉత్పత్తికి చేరువైన వారిని ప్రోత్సహించాలని టీహబ్‌ 67 మందిని ఎంపిక చేసిందని, వారికి ప్రభుత్వం, టీహబ్, ప్రై వేటు సంస్థలద్వారా కూడా ప్రోత్సాహం, మెంటరింగ్‌ అందించడం జరుగుతుందన్నారు. అనంతరం టీహబ్‌ ఎంపిక చేసి, నాలుగు రోజులపాటు శిక్షణ పొందిన పది మంది స్టార్టప్‌ల నిర్వాహకులకు జయేష్‌ రంజన్‌ చేతుల మీదుగా సర్టిఫికెట్‌లు అందించారు. అనంతరం ‘ఏ డే ఇన్‌ ఏ లైఫ్‌ ఆఫ్‌ ఆయన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌–హైస్‌ అండ్‌ లో’ అనే అంశంపై టీహబ్‌ సీఈఓ రవినారాయణ్, థిక్‌షేక్‌ ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు ఎం యశ్వంత్‌నాగ్, గ్రాబ్‌ఆన్‌ వ్యవస్థాపకులు అశోక్‌రెడ్డి, మ్యాప్‌మైజీనోమ్‌ వ్యవస్థాపకులు అనుఆచార్య తమ అనుభవాలు, స్టార్టప్‌ల రూపకల్పన, వాటిని ఉత్పత్తిగా మార్చడం, మార్కెటింగ్‌ చేయడం, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా విజయం సాధించారో వారు వివరించారు.

Related Posts

Latest News Updates