Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

వినాయక చవితి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి ఆరాధ్యునిగా, ఆటంకాలను తొలగించే విఘ్నశ్వరుడిగా భక్తి శ్రద్ధలతో హిందువులు గణనాథుడ్ని ఆరాధిస్తారని తెలిపారు. తలపెట్టిన కార్యాలు నిర్విఘ్నంగా కొనసాగేలా, సుఖ శాంతులతో జీవించేలా విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోయి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు. గణనాథుని కరుణాకటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి చెందాలని ఆయన అభిలషించారు.

 

 

Related Posts

Latest News Updates