Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

అద్దెకుండే వాళ్ల వివరాలు హాక్‌ ఐలో నమోదు చేయండి

తెలంగాణలో ప్రజల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పోలీసు యంత్రాంగం నడుం బిగించింది. ఎలాంటి నేరాలు, ఘోరాలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు టెక్నాలజీని వినియోగించనుంది. ఈ మేరకు మీ ఇంట్లో కిరాయి ఉండే వాళ్ల వివరాలను హాక్‌ ఐలో నమోదు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి కోరారు. అద్దెకుండేవారు, పేయింగ్‌ గెస్టులు, పని మనుషుల పూర్తి వివరాలు తీసుకోవాలని సూచించారు. ఈ వివరాల నమోదు వల్ల ఎలాంటి నేరాలు జరిగినా.. వారిని పట్టుకోవడం సులభంగా మారుతుందని తెలుపుతూ ఆయన ట్వీట్‌ చేశారు. చట్టవ్యతిరేక, అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు బాధ్యతగల పౌరులుగా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Related Posts

Latest News Updates