Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అమెరికాలో జాతి వివక్ష… ఈసారి భారతీయులపై

అమెరికాలో జాతి వివక్ష మళ్లీ తెరపైకి వచ్చింది. నలుగురు భారతీయ మహిళలపై మెక్సికన్ అమెరికన్ మహిళ రెచ్చిపోయింది. జాత్యహంకార దూషణలతో దాడికి దిగింది. ఈ ఘటన టెక్సాస్‌.. డల్లాస్‌లోని పార్కింగ్ స్థలంలో చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన నలుగురు మహిళలను ఉద్దేశిస్తూ.. ‘ఐ హేట్ యూ ఇండియన్స్, గో బ్యాక్’ అంటూ ఆమె దుర్భాషలాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసులు ఆమెను ఆరెస్ట్ చేశారు. పార్కింగ్‌ లాట్‌లో భార‌తీయ మ‌హిళ‌ల‌ను ఇష్టం​ వచ్చినట్టు బూతులు తిడుతూ వారిపై దాడి చేసింది. కాగా, ఈ ఘటనను తన సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూనే మహిళలను కొడుతూ.. బూతులు తిట్టింది.

 

తాను ఎక్కడికి వెళ్లినా ఇండియన్స్‌ కనిపిస్తున్నారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. భారత మహిళలను.. మీరు ఇండియాకు వెళ్లిపోవాలంటూ మెక్సికన్ మహిళ బెదిరించింది. ఇండియాలో బెటర్‌ లైఫ్‌ లేకపోవడం వల్లే మీరు అమెరికాకు వస్తున్నారని ఆమె ఆరోపించింది. ఈ సందర్భంగానే తాను భారతీయులను ద్వేషిస్తానని చెప్పుకొచ్చింది. తాను ఇక్కడే పుట్టానని.. ఇక్కడే పెరిగానని. కానీ, మీరు ఇండియాలో పుట్టి ఇక్కడికి వస్తున్నారు. ఒక‌వేళ ఇండియాలో లైఫ్ బాగా ఉంటే అప్పుడు మీరు ఇక్క‌డకి ఎందుకు వ‌చ్చిన‌ట్లు మెక్సికన్ అమెరికన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Related Posts

Latest News Updates