Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

పెట్టుబడుల్లో నం:1 రియల్టీనే!

రియల్‌ ఎస్టేట్, బంగారం, స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్స్‌.. ఇలా పెట్టుబడి సాధనాలు ఎన్ని ఉన్నా సరే రియల్టీకే జై కొట్టారు. హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ), అల్ట్రా హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (యూహెచ్‌ఎన్‌ఐ) ఇన్వెస్ట్‌మెంట్స్‌కు బెస్ట్‌ ఆప్షన్‌గా ప్రాపర్టీలను ఎంచుకుంటున్నారని హ్యురన్‌ ఇండియా లగ్జరీ కన్జ్యూమర్‌ సర్వే రిపోర్ట్‌–2019లో వెల్లడైంది. దేశంలో మిలీనియల్స్, సంపద వృద్ధే దీనికి కారణమని పేర్కొంది.
మూడేళ్లలో రెట్టింపు వృద్ధి..
మన దేశ హెచ్‌ఎన్‌ఐలు, యూహెచ్‌ఎన్‌ఐలు రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులకే ఆసక్తిగా ఉన్నారు. 28.6 శాతం హెచ్‌ఎన్‌ఐలు ఆసక్తిగా ఉన్నారని, వచ్చే రెండేళ్లలో ఇది రెట్టింపు అవుతుందని సర్వే తెలిపింది. ఇతర విభాగాల్లో పెట్టుబడుల ఆసక్తి ఎలా ఉందంటే.. బంగారం మీద 19.1 శాతం, స్టాక్‌ మార్కెట్స్‌లో 17.1 శాతం, ఫిక్స్‌డ్‌ ఇన్‌కంలో 8.6 శాతం, డిపాజిట్స్, ఫండ్స్‌ల్లో 6.7 శాతం, బీమాలో 4.8 శాతం, ఆర్ట్, కమోడిటీస్‌ల్లో 2.9 శాతం, కరెన్సీలో 1.9 శాతం, వీసీ/పీఈలో 1 శాతంగా ఉంది. వచ్చే మూడేళ్లలో రియల్టీ పెట్టుబడులు మరింత పెరుగుతాయని, ఈ విషయంలో 30.8 శాతం మంది ఆసక్తిగా ఉన్నారని సర్వే తెలిపింది.
హాట్‌ ప్లేస్‌ యూకేలో ఇన్వెస్ట్‌..
ఇక రియల్టీ పెట్టుబడులకు హాట్‌ డెస్టినేషన్‌ యూకే. ఇక్క స్థానిక సామాజిక, రాజకీయ అస్థిరత ఉన్నప్పటికీ యూకేలో పెట్టుబడులకు 19.6 శాతం హెచ్‌ఎన్‌ఐలు, యూహెచ్‌ఎన్‌ఐలు ఆసక్తిగా ఉన్నారు. ఆ తర్వాత సింగపూర్‌లో 16.7 శాతం, కెనడా, అమెరికాలో 11.8 శాతం, యూఏఈలో 9.8 శాతం, సౌదీ అరేబియాలో 6.9 శాతం, శ్రీలంకలో 5.9 శాతం, దక్షిణాఫ్రికాలో 3.9 శాతం ఆసక్తిగా ఉన్నట్లు సర్వే తెలిపింది.

మిలీనియల్స్, సంపద వృద్ధే కారణం
– అనస్‌ రెహమాన్, చీఫ్‌ రీసెర్చర్, హ్యురన్‌ రిపోర్ట్‌ ఇండియా
దేశంలో మిలీనియల్స్, ఉద్యోగ యువత జనాభా పెరుగుతుంది. దీంతో సంపద కూడా వృద్ధి చెందుతుంది. వచ్చే నాలుగేళ్లలో స్థూల దేశీయోత్పత్తి రెట్టింపు అవుతుంది. దీంతో లగ్జరీ ఉత్పత్తులు, సేవల మీద వ్యయం కూడా వృద్ధి చెందుతుంది.

Related Posts

Latest News Updates