Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

జేపీ నడ్డాతో టాలీవుడ్ హీరో నితిన్ భేటీ

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టాలీవుడ్‌ యువ హీరో నితిన్‌ సమావేశం అయ్యారు. బండి సంజయ్‌ పాదయాత్ర ముగింపు సందర్భంగా వరంగల్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ అనంతరం హైదరాబాద్‌ వచ్చిన నడ్డా శంషాబాద్‌లోని నోవాటెల్‌లో నితిన్‌తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో నడ్డా, నితిన్‌లతో పాటు బీజేపీ ఎంపీ లక్ష్యణ్‌, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. నితిన్‌ బీజేపీ తరపున ప్రచారం చేయడానికి సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. ఈ దిశగా జేపీ నడ్డా చేసిన ప్రతిపాదనకు నితిన్‌ అంగీకరించారన్నారు. ప్రధాని మోదీ కోసం అవసరమైతే బీజేపీ తరపున పని చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలిపారు.

Related Posts

Latest News Updates