Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మహారాష్ట్రలో రైలు ప్రమాదం… 53 మందికి గాయాలు

మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ప్యాసింజర్ రైలును గూడ్స్ రైలు ఢీకొని, దాదాపు 53 మంది గాయపడ్డారు. వీరిలో 13 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గోందియా జిల్లాలో ఈ దుర్ఘటన అర్ధరాత్రి జరిగిందని అధికారులు పేర్కొన్నారు. అయితే… నాగపూర్ నుంచి రాయ్ పూర్ వెళ్తున్న భగత్ కోటి ఎక్స్ ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ కారణంగానే ప్రమాదం జరిగింది. ఇక… సిగ్నల్స్ లో లోపం తలెత్తడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే పేర్కొంది. అయితే… ఈ దుర్ఘటన సందర్భంగా ప్యాసింజర్ రైలుకు సంబంధించిన 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో గాయపడిన 53 మందిని గోండియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. రాయపూర్ నుంచి నాగపూర్ కు ప్యాసింజర్ రైలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

Related Posts

Latest News Updates