Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అవమానించింది… ఫైర్ అయిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్ గా మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తమిళిసై రాజ్ భవన్ లో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పర్యటన సందర్భంలో హెలికాప్టర్ సౌకర్యం అడిగినా… ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. రాజ్ భవన్ లో తాను ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్నానని, కొన్ని విషయాలు బయటకు చెప్పలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మూడేళ్లలో గవర్నర్ వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వం వివక్షత చూపించిందని ఆరోపించారు. ప్రజల దగ్గరికి వెళ్లి, వారి సమస్యలు అడుగుదామనుకుంటే ఏదో ఒక అడ్డంకి ఎదురయ్యేదన్నారు.

 

సమ్మక్క సారక్క జాతర సందర్భంగా జరిగిన పర్యటనలోనూ తనను అవమానించారని మండిపడ్డారు. అయితే… ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్మలమైన మనస్సుతోనే విధులు నిర్వర్తిస్తానని గవర్నర్ స్పష్టం చేశారు. తెలంగాణకు మంచి చేయాలన్న అభిలాషే తనకు వుందని, ప్రభుత్వం తనను గౌరవించకపోయినా… ప్రజల కోసం పనిచేస్తానని తమిళిసై అన్నారు. ఇక… రిపబ్లిక్ డే రోజున జెండా ఎగరేసే అవకాశం కూడా కల్పించలేదని, వాస్తవాలు ప్రజలకు తెలియాలని అన్నారు. అయితే… పెద్ద ఆస్పత్రి డైరెక్టరే సాక్షాత్తూ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారని, తెలంగాణలో వైద్య పరిస్థితి ఎలా వుందో తెలుసుకోవచ్చని గవర్నర్ తమిళిసై చురకలంటించారు.

Related Posts

Latest News Updates