Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ప్రజా సంగ్రామ యాత్రకు లైన్ క్లియర్… బండి పాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతినిచ్చింది. పాదయాత్రను నిలిపేయాంటూ వర్ధన్నపేట ఏపీసీ ఇచ్చిన నోటీసులను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆ నోటీసులు రాజ్యాంగ విరుద్ధంగా వున్నాయని ఆక్షేపించింది. బుధవారం బీజేపీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పాద యాత్రకు అనుమతినివ్వడంతో పాద యాత్రకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నెల 27 న వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగుస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హస్తముందని బీజేపీ ఎంపీ పర్వేశ్ సింగ్ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కార్యకర్తలు కవిత ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. దీనిని నిరసిస్తూ… బండి సంజయ్ జనగామలో ధర్మదీక్ష పేరుతో నిరసన దీక్షకు కూర్చోవడానికి సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించకూడదని, విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ జనగామ ఏసీపీ బండి సంజయ్ కి నోటీసులిచ్చారు. దీంతో బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు.

Related Posts

Latest News Updates