Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్

తెలంగాణ ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ సయ్యద్ ఒమర్ జలీల్ ఫలితాలు రిలీజ్ చేశారు. బాలికలు 53.59% , బాలురు 44.43% పాసయ్యారు.పాస్ పర్సెంటేజ్ లో ములుగు జిల్లా మొదటి స్థానం, వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మే నెలలో ఇంటర్మీడియెట్‌ రెగ్యులర్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఉన్నందున విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సప్లిమెంటరీ ఫలితాలను ముందుగానే ప్రకటించారు. రీకౌంటింగ్ కోసం సెప్టెంబర్ 5 నుండి 8 వరకు విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 1 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 1.13లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.

Related Posts

Latest News Updates